సారిక టౌన్ షిప్, పోతుల మడుగు టౌన్ షిప్ లే- అవుట్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు.

సారిక టౌన్ షిప్, పోతుల మడుగు టౌన్ షిప్ లే- అవుట్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు.

మంగళవారం ఆయన భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సారిక టౌన్ షిప్ ను, అదే విధంగా భూత్పూర్ మండలం పోతులమడుగు వద్ద ఉన్న పోతులమడుగు టౌన్ షిప్ ను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా రెండు టౌన్షిప్లలో ఏర్పాటుచేసిన ఫ్లాట్లు, ఇప్పటివరకు ప్లాట్ల కు నిర్వహించిన వేలం, మిగిలిపోయిన ప్లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిపోయిన ప్లాట్లలో చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచడమే కాకుండా, టౌన్ షిప్ మొత్తం శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మిషన్ భగీరథ పైప్ లైన్ తనిఖీ చేసి ఎక్కడైనా లీకేజీలున్నట్లయితే వాటిని అరికట్టాలని అన్నారు. భూత్ పూర్ మున్సిపాలిటీ ద్వారా ఎప్పటికప్పుడు సారిక టౌన్ షిప్ నిర్వహణ చేపట్టాల్సిందిగా చెప్పారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, భూత్పూర్ మున్సిపల్ కమిషనర్ నూరుల్ నజీబ్, గృహ నిర్మాణ శాఖ ఈ ఈ వైద్యం భాస్కర్ ,బూత్పూర్ తహసిల్దార్ చెన్నకిష్టన్న తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

 

Share This Post