సాహిత్య దినోత్సవ పోటీలలో పాల్గొనేవారు జూన్ 9లోగా పేర్లు నమోదు చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

సాహిత్య దినోత్సవ పోటీలలో పాల్గొనేవారు జూన్ 9లోగా పేర్లు నమోదు చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

*సాహిత్య దినోత్సవ పోటీలలో పాల్గొనేవారు జూన్ 9లోగా పేర్లు నమోదు చేసుకోవాలి… జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

*పద్య, వచన, కవితల పోటీలలో విజేతలకు నగదు బహుమతులు

*విజేతలకు మొదటి బహుమతి 5 వేలు, రెండవ బహుమతి 3 వేల 500, మూడవ బహుమతి ఒక వెయ్యి 500 రూపాయలు

*పోటీలలో పాల్గొనుటకు జూన్ 9 లోపు పేర్లు నమోదు చేసుకోవాలి

*తెలంగాణ అస్తిత్వం, ప్రగతి ప్రతిబింబించేలా తెలుగు, ఉర్దూ భాషలో పద్య, వచన, కవితల పోటీలు

————————–
పెద్దపల్లి, జూన్-07:
————————–
రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా నిర్వహించే సాహిత్య దినోత్సవంలో పాల్గొనేందుకు ఆసక్తి గల కవులు, కవయిత్రి లు జూన్ 9 లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, విజేతలకు నగదు బహుమతులను అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని *తెలంగాణ అస్థిత్వము, తెలంగాణ ప్రగతి ప్రతిబింబించేలా పద్య, వచన, కవితల పోటీలను తెలుగు, ఉర్దూ భాషలలో నిర్వహించనున్నట్లు, పోటీలలో పాల్గొనడానికి జిల్లాలోని ఆసక్తి గల కవులు, కవయిత్రిలు జూన్ 9 లోగా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

విజేతలకు మొదటి బహుమతి 5000/-, రెండవ బహుమతి 3,500/-, మూడవ బహుమతి 1,500/- రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు.

తెలుగు భాషలో అయితే జూనియర్ కళాశాల, పెద్దపల్లిలో సునీల్ కుమార్ మొబైల్ నెంబర్: 9849263284 వద్ద, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, పెద్దపల్లిలో, ఉర్దూ భాషలో అయితే జిల్లా మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్, పెద్దపల్లి మొబైల్ నెంబర్ 9440008814 నకు తెలంగాణ ఆస్తిత్వము, తెలంగాణ ప్రగతి అంశాలపై తమ కవితలు సమర్పించి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

గడువు తరువాత వచ్చే పేర్లను ఎట్టి పరిస్థితులలో అంగీకరించబడవని, ఇట్టి సదవకాశాన్ని జిల్లాలోని కవులు , కవయిత్రిలు సద్వినియోగం చేసుకోవాలని
జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
—————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post