సింగరేణి ఓసి 02, ఓసి -03 గనులలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు చట్టబద్దంగా ప్రభుత్వపరంగా సర్వే నిర్వహించి వీడియో ఫోటో రికార్డింగ్ ద్వారా సమాచారాన్ని పొందుపరిచి నష్టపరిహారం చెల్లించడంతో పాటు న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 8 ( బుధవారం )

సింగరేణి ఓసి 02, ఓసి -03 గనులలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు చట్టబద్దంగా ప్రభుత్వపరంగా సర్వే నిర్వహించి వీడియో ఫోటో రికార్డింగ్ ద్వారా సమాచారాన్ని పొందుపరిచి నష్టపరిహారం చెల్లించడంతో పాటు న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
తెలిపారు.
బుధవారం కలెక్టర్ చాంబర్లో స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, సింగరేణి, జెన్కో యాజమాన్యంతో పాటు రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్ అధికారులతో కలిసి సింగరేణి, జెన్కో సంస్థలకు భూసేకరణ కొరకు భూముల సర్వే, ఫారెస్ట్ క్లియరెన్స్, పునరావాస ప్యాకేజీ సంబంధిత విషయాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓసి 2 లో గడ్డిగానిపల్లి లో 38 ఎకరాలు మరోసారి సర్వే నిర్వహించి, ఫకీర్ గడ్డ 28 ఎకరాలు
ఓసి 03 లో భూములకు పునరావాస ప్యాకేజీ పై ప్రత్యేక టీమ్లను ఫామ్ చేసి సర్వే నిర్వహిస్తామని అన్నారు . భూముల సర్వే నిర్వహించేటప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నామని వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ద్వారా సమాచారాన్ని పొందుపరచటం ద్వారా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. ప్రజలు ఎవరూ కూడా అధైర్య పడవద్దని ప్రభుత్వ నిబంధనల మేరకు నష్టపరిహారం అందుతుందని పునరావాసం కల్పించడం కొంచెం ఆలస్యమైనా కూడా ప్రస్తుతం బాధితులకు చట్టప్రకారం అత్యధిక స్థాయిలో నష్టపరిహారం చెల్లించడంతో పాటు సౌకర్యవంతంగా నివసించేలా స్థలాన్ని ఎంపిక చేసి గేటెడ్ కమ్యూనిటీతో సిసి రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, కమ్యూనిటీ హాల్ తదితర అన్ని వసతులతో పునరావాసం కల్పిస్తామని అన్నారు. ఫారెస్ట్ సమస్యలు ఉన్న దగ్గర ఫారెస్ట్ తో సంప్రదించి సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు.
నష్టపరిహారం చెల్లింపు, పునరావాసం ఏర్పాట్లకు చొరవ చూపాలని రైతులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
బి. శాసనసభ్యులు వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి తమ వ్యవసాయ భూములను, ఇండ్లను త్యాగం చేసిన గ్రామస్తులకు ఎంత ఇచ్చినా తక్కువే అని ఉన్నంతలో సౌకర్యవంతంగా ఉండేలా భూములకు సర్వే నిర్వహించి
పునరావాసం కల్పించాలని అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఇంటి స్థలాలు, ఇండ్లకు అత్యధిక స్థాయిలో నష్ట పరిహారం చెల్లించేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి జిఎం శ్రీనివాస్ , జెన్కో ఎస్ఇ తిరుపతయ్య, ఆర్డీవో శ్రీనివాస్, ఎఫ్డిఓ విజయరెడ్డి, ఎఫ్డివో కృష్ణ ప్రసాద్, కలెక్టరేట్ సూపరింటిండెంట్ రవికిరణ్, సంబంధిత రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post