సింగరేణి భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించి చట్టప్రకారం వారికి అందించాల్సిన నష్ట పరిహారం త్వరగా అందేలా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 12 (మంగళవారం).

సింగరేణి భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించి చట్టప్రకారం వారికి అందించాల్సిన నష్ట పరిహారం త్వరగా అందేలా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సింగరేణి కేటీకే ఓసి-3 ప్రభావ గ్రామమైన ఘనపూర్ మండలం ధర్మరావుపేట రెవెన్యూ విలేజ్ పరిధిలోని బాధిత గ్రామాలకు చెందిన ప్రజలతో జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి సింగరేణి డైరెక్టర్లు బలరాం నాయక్, చెంద్రశేఖర్ లతో కలిసి భూసేకరణ, నష్టపరిహారం పంపిణీపై సమీక్షించారు.
ఈ సందర్భంగా బాధిత గ్రామాల ప్రజలు మాట్లాడుతూ సింగరేణి కేటీకే ఓసి-3 ఏర్పాటుతో పంట భూములను, ఇండ్లను, ఇళ్ల స్థలాలను కోల్పోయిన మాకు ఇప్పటివరకు మేము కోల్పోయిన అన్ని భూములకు ఇండ్లకు నష్ట పరిహారం అందించలేదని అలాగే ఓసి-3 ఏర్పాటుతో పంట పొలాలను కోల్పోయి ఉపాధి కోల్పోయిన మా గ్రామానికి చెందిన నిరుపేదలకు ఓసి-3 లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రస్తుతం ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని మా ఊరిలోని పేదవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ దేశంలో విద్యుత్ ఉత్పత్తికి, పరిశ్రమలను నడపడానికి తదితర అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేసి దేశానికి సేవ చేస్తున్న సింగరేణి సంస్థ విస్తరణ కోసం పంట భూములను మరియు ఇళ్లస్థలాలను, ఇండ్లను కోల్పోయిన బాధిత రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత సింగరేణి సంస్థ పైన ఉందని సింగరేణి ఓసి-3 లో కోల్పోయిన పంట భూములలో కొన్ని పట్టాదారు, అనుభవదారు తదితర వివాదాలతో నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం జరిగిందని ప్రస్తుతం రెవెన్యూ అధికారులతో ఆయా భూముల యజమానులను గుర్తించే పనిలో ఉన్నామని త్వరలోనే నిజమైన లబ్ధిదారులను గుర్తించి నష్టపరిహారం అందేలా చూస్తామని అన్నారు. అదేవిధంగా ఇంటిని, ఇళ్ల స్థలాలను కోల్పోయిన గ్రామంలోని ఇండ్లను సర్వే చేసి ఇంటి వ్యాల్యూ, చెట్లు తదితర వాటిని లెక్కించి చట్టప్రకారం నష్ట పరిహారం అందేలా చూస్తామని అన్నారు. సింగరేణి ఓసి3 లో ఇకనుండి బాధిత రైతులకు, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
అనంతరం సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తిలో సాధిస్తున్న ప్రగతి, సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, పరిసర గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలపై సింగరేణి అధికారులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి జిఎం శ్రీనివాసరావు జిఎం ఎస్టేట్స్ వెంకటేశ్వర్ రెడ్డి, కార్పొరేట్ ఆఫీస్ అధికారి రవి ప్రసాద్, సీనియర్ ఎస్టేట్ మేనేజర్ బాబుల్ రాజ్, ధర్మారావుపేట, కొండంపల్లి, నగరంపల్లి,మాదవరావుపల్లి గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post