సిఆర్పిఎఫ్ సైకిల్ యాత్ర జాతీయ సమైక్యతకు స్ఫూర్తి -జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర.

సెప్టెంబర్ 13, 2021ఆదిలాబాదు:-

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజల్లో సమైక్యతా భావం, ఐక్యమత్యంను పెంపొందించే దిశలో సిఆర్పిఎఫ్ సైకిల్ యాత్ర జిల్లా ప్రజలు నూతన ఉత్సవం కలిగించిందని జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర పేర్కొన్నారు, సోమవారం ఉదయం స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంలో సైకిల్ యాత్ర వీడ్కోలు సభలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు “ఆజాది కా అమృత్ మహోత్సవ్” వేడుకలను సిఆర్పిఎఫ్ బలగాలు సైకిల్ యాత్ర ద్వారా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆదివారం జిల్లాకు చేరుకున్న, సైకిల్ యాత్రికులు రాత్రి పోలీస్ శిక్షణ కేంద్రంలో విశ్రాంతి తదుపరి ఉదయం సైకిల్ ర్యాలీ కొనసాగించడానికి సిద్ధమయ్యారు, ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు, శ్రీ వెంకటేశ్వర సంగీత నాట్య కళా నిలయం ఫౌండర్ కవిత వైద్య నేతృత్వంలో సంస్కృత కార్యక్రమాలు చేపట్టి అలంకరించారు, పోలీస్ కళాజాత బృందం ఇంచార్జ్ ఏఎస్ఐ కేశవ స్వామి ఆధ్వర్యంలో కళా ప్రదర్శన చేసి యాత్రికులను ఆహ్లాదకరంచారు, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేరడిగొండ సరిహద్దు నుండి మహారాష్ట్ర సరిహద్దు వరకు జిల్లా ప్రజలు ఘనమైన స్వాగతం పలుకుతూ జాతీయ సమైక్యతపై నినాదాలు చేస్తూ, ఉత్సాహంతో సిఆర్పిఎఫ్ సైకిల్ యాత్రికుల వెంట ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు,21 మంది సభ్యుల సైకిల్ యాత్రలో ఇద్దరు దివ్యంగా అధికారుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు, భారతదేశమంతటా శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన పాత్ర సిఆర్పిఎఫ్ బలగాలు పోషిస్తాయని అన్నారు, అనంతరం అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా శేఖర్ మాట్లాడుతూ సిఆర్పిఎఫ్ బలగాల గురించి సాధారణ ప్రజలకు తెలిసింది… మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టడం, శాంతిభద్రతలు క్షీణించినప్పుడు బందోబస్తు నిర్వహించడం, తదితర అంశాలపైనే విధులు నిర్వర్తించడం చూశామని, మొదటిసారిగా దేశ ప్రజలకు జాతి ఐక్యమత్యంపై స్ఫూర్తి కలిగించే కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయమన్నారు, భారతీయులందరిని సమైక్యత భావంతో ఒక్కటిగా ఉండేవిధంగా సంకల్పించిన యాత్రను కొనసాగిస్తున్న తీరు అద్భుతంగా ఉందన్నారు, ప్రతి జిల్లా, మండల కేంద్రంలో ప్రజలతో సమన్వయం చేసుకుంటూ సాగుతున్న యాత్ర ఢిల్లీ రాజ్ ఘాట్ వరకు విజయవంతంగా కొనసాగించి, స్ఫూర్తిని నింపడమే లక్ష్యంతో పూర్తి చేయాలన్నారు, భారతదేశమంతటా “ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్” నినాదంను నిజం చేస్తూ దేశ ప్రజలందరూ ఐక్యమత్యంతో ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలని ఆకాంక్షించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కెల్లా సర్వశ్రేష్టమైన ఆతిథ్యం అందించిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు-సిఆర్పిఎఫ్ చీఫ్ కమాండెంట్ విద్యాధర్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నేతృత్వంలో సిఆర్పిఎఫ్ సైకిల్ యాత్రికులకు ఘనమైన ఆతిథ్యం అందించిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సిఆర్పిఎఫ్ చీఫ్ కమాండెంట్ విద్యాధర్ అన్నారు, ఉదయం వీడ్కోలు సమావేశం లో పాల్గొని మాట్లాడారు, అలసిపోయి ఉన్న సైకిల్ యాత్రికులకు సకల సౌకర్యాలు, భోజన వసతులు కల్పించి చిరస్మరణీయంగా ఆతిథ్యం అందించారని కొనియాడారు, జిల్లా పోలీసులకు, యాత్రలో పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థినీ విద్యార్థులు, స్థానిక సంస్థలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, సి. సమయ్ జాన్ రావు, బి. వినోద్ కుమార్, టిఎస్ఎస్పి కమాండెంట్ ఆర్ వేణుగోపాల్, డిఎస్పి వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జే. కృష్ణమూర్తి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఓ సుధాకర్ రావు, గడి కొప్పుల వేణు, సిఆర్పిఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దినేష్ కుమార్ సింగ్, ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, డిటిసి సీఐ పేర్ల గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post