సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 6 , 7 , 8 వార్డులోని వాక్సినేషన్ సెంటర్ లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ మంగళ వారం సందర్శించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు స్వచ్చందంగా వచ్చి రెండవ డోసు వాక్సిన్ వేయించుకోవాలని, అధికారులు ప్రజలు వాక్సిన్ వేయించుకునేలా  చేయాలనీ వంద శాతం వాక్సినేటెడ్  నగరంగా తయారు చేయాలన్నారు.

            ఈ ప్రాంతంలో అధికారులు ఇంటింటి సర్వే ను త్వరగా పూర్తీ చేయాలనీ వాక్సిన్ రెండవ డోసు వేయించుకొని వారిని గుర్తించి వారు వాక్సినేషన్ సెంటర్ కు వచ్చి వాక్సిన్ తీసుకునే విదంగా ప్రోత్సయించాలని  చెప్పారు. అర్హులైన  వారందరికీ రెండవ విడత వాక్సినేషన్ జరిగేలా చూస్తామని అన్నారు. కలెక్టర్ ఇంటిటికి వెళ్లి అందరూ వాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ఇళ్లలోని వారిని పిలిచి అందరు తప్పకుండ వాక్సిన్ తీసుకోవాలని  అధికారులకు సహకరించాలని కోరారు .

            ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, జిల్లా  సాంఘిక సంక్షేమ శాఖాధికారి రామారావు, బిసి సంక్షేమ అధికారి ఆశన్న, జిల్లా యువజన సంక్షేమ అధికారి సుధాకర్ రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share This Post