సికింద్రాబాద్ రసూల్ పురా లోని యు.పి.హెచ్.సి ప్రక్కన గల కమ్యూనిటీ హాల్ లో జరిగిన వ్యాక్సినేషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ శ్రీ శర్మన్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగ పరచు కోవాలని అన్నారు.శనివారం వ్యాక్సినేషన్ సెంటర్ సందర్శించి ఇంటింటి సర్వే పై అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటి సర్వే పై సంతృప్తి ని వ్యక్తం చేస్తూ అందరికి వ్యాక్సినేషన్ చేయాలని ఎవరైనా వ్యాక్సినేషన్ సెంటర్ కు రాలేని వారు ఉంటే వారికి ఇంటికి వెళ్ళి వ్యాక్సినేషన్ చేయల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సి.ఇ.ఓ శ్రీ అజిత్ రెడ్డి , జిల్లా వైద్య శాఖాదికారి డా.వెంకటి, జిల్లా టి.బి. అధికారి శ్రీమతి విజయలక్ష్మి , సికింద్రాబాద్ ఆర్.డి.ఓ వసంత కుమారి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.