సికింద్రాబాద్ లోని బొల్లారం రిక్రియేషన్ క్లబ్ లో జరిగిన వ్యాక్సినేషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ శ్రీ శర్మన్ సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని అన్నారు.
బొల్లారంలోని ఇంటింటికి వెళ్లి అక్కడి స్ధానికులను వ్యాక్సిన్ వేయించుకున్నది లేనిది తెలుసుకున్నారు. అర్హత ఉన్న వారందరు వ్యాక్సిన్ వేయించుకున్న వారి ఇంటిముందు స్టిక్కర్ లు అంటించింది లేనిది స్వయంగా పరిశీలించి స్టిక్కర్ లేని ఇంటివారిని అడిగి ఎందుకు వేయించుకోలేదో వారిని అడిగి తెలుసుకుని తప్పకుండా వ్యాక్సిన్ వేయుంచుకోవాలని కోరారు.
ఈ ప్రాంతంలో అధికారులు ఇంటింటి సర్వేను పూర్తి చేశామని, వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించి వారు వ్యాక్సినేషన్ సెంటర్ కు వచ్చి వ్యాక్సిన్ తీసుకోనేవిధంగా Motivate చేశామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారు డా. వెంకట్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post