ఈ ప్రాంతంలో అధికారులు సర్వే పూర్తీ చేశామని చెప్పారు కానీ కలెక్టర్ తానే స్వయంగా కారు వెళ్లలేని కాలనీలకు బైకు మీద వెళ్లి ప్రతి ఇంటికి స్టికర్ అంటించారా లేదా అని పరిశీలించి అక్కడి ప్రజలకు మా అధికారులు వచ్చి వాక్సినేషన్ గురించి వివరించి వివరాలు సేకరించారు లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలను ఉద్దేశించి మీరు తప్పకుండ వాక్సిన్ చేయించుకోవాలని కోరారు. నగరంలో వంద శాతం వాక్సినేషన్ సాదించటానికి మీరు సహకరించాలని వారికీ విజ్ఞప్తి చేసారు. వాక్సినేషన్ సెంటర్ లోని అధికారులకు వంద శాతం వాక్సినేషన్ రేపటిలోగా పూర్తి చేయాలనీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్ ఓ డా . వెంకటి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.