సిజెరియన్ ఆపరేషన్ లను ప్రోత్సహించకుండా సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలి….

సిజెరియన్ ఆపరేషన్ లను ప్రోత్సహించకుండా సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలి….

ప్రచురణార్థం

సిజెరియన్ ఆపరేషన్ లను ప్రోత్సహించకుండా సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలి….

మహబూబాబాద్, మే -09:

సిజేరియన్ ఆపరేషన్లు ప్రోత్సహించకుండా, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆర్.ఎం.పి. లను కోరారు.

సోమవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లా వైద్య అధికారులు, ఆర్.ఎం.పిల తో సమావేశం ఏర్పాటు చేసి సాధారణ ప్రసవాలు పెరిగే విధంగా చూడాలని.తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గర్భీణులు తమ దగ్గరికి వైద్యానికి వచ్చినపుడు వారికి ఆరోగ్య పరిస్తితులు వివరించి సాధారణ ప్రసవాలను ప్రోత్సాహించాలని, దానిలో భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రజలలో ఈ కార్యక్రమం పై అవగాహన కొరకు అంగన్ వాడీ, ఆశావర్కర్, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తో పెద్దఎత్తున కార్యక్రమం చేపడుతున్నమన్నరు.

కొందరు ఆర్.ఎం.పి. వైద్యులు సిజెరియన్ ను ప్రోత్సహిస్తూ నార్మల్ డెలివరీ కు అవకాశం ఉన్న కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు సిజెరియన్ కొరకు మళ్లిస్తున్నారు అని, ఆరోగ్య శైలిని అలవర్చుకోవాలని, సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించే విధంగా అందరూ సహకరించాలని, నార్మల్ డెలివరీ గురించి మీ వైపు నుండి గర్భిణులకు, వారి కుటుంబ సభ్యుల కు అవగాహన కల్పించాలని, ఏదో ఆశించి సిజెరియన్ ను ప్రోత్సహించి తల్లి కొంత మేర లాభం కోసం తల్లి బిడ్డల జీవితాలకు నష్టం కలిగించిన వారు అవితున్నందున, దీనిని అరికట్టి, నార్మల్ డెలివరీ లు జరిగే విధంగా సహకరించాలని తెలిపారు.

భ్రూణ హత్యలు,. స్కానింగ్ కు సంబంధించి పి.సి.పి.ఎన్.డిటీ చట్టం ఖటినంగా అమలు చేయడం జరుగుతుందని, ఎవరైనా తప్పుడు దారిలో వెళ్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హరీష్ రాజ్, డిప్యూటీ డి.ఎం.హెచ్. ఓ. , పి. ఓ లు, ఆర్.ఎం.పి.లు, ఆర్.ఎం.పి. సంఘ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post