సిజేరియన్ ఆపరేషన్ లను తగ్గించి సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి …జిల్లా కలెక్టర్ కె. శశాంక

సిజేరియన్ ఆపరేషన్ లను తగ్గించి సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి …జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

సిజేరియన్ ఆపరేషన్ లను తగ్గించి సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి …జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, జూన్ -04:

సిజెరియన్ ఆపరేషన్ లను తగ్గించి సాధారణ ప్రసవాలు పెరిగేటట్లు చూడాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక వైద్య అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. శశాంక సిజేరియన్ ఆపరేషన్ లు తగ్గించుటకు తీసుకుంటున్న చర్యల పై సంబంధిత వైద్య అధికారులతో సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సాధారణ ప్రసవాలు జరగాలనీ, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి వారం వారం ప్రసవాలు పెరగాలని, ప్రైవేట్ వైపు వెళ్లకుండా చూడాలని, అలాగే సి సెక్షన్ ప్రైమరీ కేసులు తగ్గాలని తెలిపారు. సి సెక్షన్ కు సంబంధించి ఆడిట్ ఫార్మ్స్ ను పరిశీలించాలని, ఆపరేషన్ ఎందుకు చేయవలసి వచ్చింది అనే విషయాన్ని తరచుగా ఆసుపత్రుల్లో పరిశీలించాలని, అనవసరంగా చేస్తున్న వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని సూచించారు. సి సెక్షన్ కు సంబంధించి ప్రతి శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించడం జరుగుతుందని, వారం వారం తనిఖీలు చేసి వివరణ ఇవ్వాలని, సాధ్యమైనంత ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగే విధంగా అవగాహన కల్పించాలని, అవగాహనతో పాటు తనిఖీలు చేసి సి సెక్షన్ కు సంబంధించి ఆడిట్ ఫార్మ్ లను పరిశీలించాలని ఆదేశించారు. మెటర్నిటీ వార్డ్, గైనకాలజిస్ట్ లు, అర్హత లేకుండా ఆపరేషన్ లు చేస్తున్న వారి వివరాలు ఇవ్వాలని, ప్రతి వారం నిర్వహించే సమీక్షలో గైనకాలజిస్ట్ లు హాజరు కావాలని, జిల్లాలో ఎక్కడ కూడా అనవసరంగా సి సెక్షన్ జరుగకుండా చూడాలని తెలిపారు.కమిటీ ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలను సమర్పించాలని తెలిపారు.

రోజుకు ఒక నర్సింగ్ హోం ను తనిఖీ చేయాలనీ, గర్భం దాల్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వివరాలను కె.సి.ఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి పోర్టల్ ప్రకారం పరిశీలించి మొదటి కాన్పు నార్మల్ అయిన తర్వాత రెండవ కాన్పు ఆపరేషన్ చేసిన సందర్భంలో వివరాలు పరిశీలించాలని, అలాగే మొదటి కాన్పు సాధ్యమైనంత మేరకు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగే విధంగా మార్పు రావాలని, కావాలని ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న వారిపై దృష్టి సారించి నివేదిక ఇవ్వాలని, తక్కువ డెలివరీలు నమోదు అవుతున్న సబ్ సెంటర్ లను గుర్తించాలని ఆదేశించారు.

సబ్ సెంటర్ వారీగా వైద్యాధికారులు ఏ.ఎన్.ఎం. లను జూమ్ సమావేశం ద్వారా సమీక్షించి రిజిస్ట్రేషన్, ఏ.ఎన్.సి. థర్డ్, ఫోర్త్, ప్రైవేట్ డేలివరిలు, సి సెక్షన్ వారీగా సమీక్షించాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సబ్ సెంటర్ వారీగా వివరాలను పరిశీలించారు. అలాగే ఇమ్మునైజేషన్ వంద శాతం పూర్తి కావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ బి. వెంకట్ రాములు, డిప్యూటీ డి ఎం హెచ్ వో అంబరీష, ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post