సిజేరియన్ ఆపరేషన్ వద్దు, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ సూచించారు.

సిజేరియన్ ఆపరేషన్ వద్దు, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ సూచించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ వైద్యులకు సూచించారు. గురువారం కలెకర్ట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సిజేరియన్ ఆపరేషన్ వద్దు- సాధారణ కాన్పు ముద్దు అంశంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, గైనకాలజిస్టులకు ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ కాన్పులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, తల్లి, బిడ్డ క్షేమం కోసం 85 శాతం సాధారణ కాన్పులు జరిగేలా చూడాలని మార్గ నిర్దేశం చేసిందని అన్నారు. కానీ మన జిల్లాలో ప్రభుత్వాసుపత్రులల్లో 40 శాతం మేర సాధారణ కాన్పులు జరుగుచున్నా, 34 ప్రైవేట్ ఆసుపత్రులకు గాను 4,5 ఆసుపత్రులు మినహా మిగతా ఆసుపత్రులు 90 శాతం మేర సిజేరియన్ చేస్తున్నాయని, ఇది ఇంతో శోచనీయమని అన్నారు. తల్లి,బిడ్డకు ప్రాణాపాయం ఉంటె తప్ప సిజేరియన్ కు వెళ్లవద్దని, కనీసం 50 శాతం పైగా సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యులు కృషి చేయాలని సూచించారు. వైద్యులు నైతిక విలువలు పాటిస్తూ తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని కోరారు. గర్భవతులు కాన్పు సమయంలో కొంత భాధను భరిస్తే సాధారణ ప్రసవం చేయడానికి వీలుంటుందని, వారికి, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కలిగించాలని, ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయంతో పాటు, కె.సి.ఆర్. కిట్టు అందిస్తున్నదని తెలపాలని అన్నారు. నిరక్షరాస్యులైన కొందరికి అవగాహన ఉండదని , వారికి సిజేరియన్ వల్ల జరిగే అనర్థాలు, దీర్ఘ కాల ఆరోగ్య సమస్యలు, సాధారణ కాన్పు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాలని అన్నారు. కొందరు జాతకాల ప్రకారం ఈ సమయానికే సిజేరియన్ జరపాలని వైద్యులపై ఒత్తిడి తెస్తారని వారికి కూడా సిజేరియన్ వల్ల కలిగే దుష్పరిమాణాలను వివరించాలన్నారు. రక్తహీనత గల గర్భిణులకు ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చి ఆరోగ్యంగా ఉండేలా చూడాలన్నారు. వైద్యులు మనస్సు పెట్టి వృత్తే దైవంగా భావించి పనిచేస్తే సాధ్యం కానిదంటూ లేదని, ప్రతి ఒక్కరు ప్రతినబూని సాధారణ ప్రసవం చేయడానికి కంకణబద్దులై పనిచేయాలని కోరారు. సిజేరియన్ చేస్తి అందుకు గల కారణాలు డాక్యుమెంటేషన్ రూపంలో పొందుపరచాలన్నారు. మూడు మాసాల అనంతరం పురోగతిని సమీక్షించడంతో పాటు ఆడిట్ చేసి, పురోగతిలేని ఆసుపత్రులపై వేటు వేయుటకు వెనుకాడబోమని అన్నారు. ఒక ఆసుపత్రిలో ఖచ్చితత్వం చేస్తున్నారని, మరో ఆసుపత్రిలో ఉదారంగా వ్యవవహరిస్తున్నారన్న భావం ప్రజలలో రాకుండా చూడాలని హితవు చెప్పారు.
డా. సుమిత్ర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సిజేరియన్, సాధారణ ప్రసవాలపై ప్రపంచం;లో, దేశంలో, రాష్ట్రం లో ఏ విధంగా ఉన్నదో వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్ రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ , డా. సురేందర్, శివదయాళ్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, గైనకాలజిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post