సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ శ్రీ వెంకట్రామిరెడ్డి రాజీనామా

సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ శ్రీ పి వెంకట్రామిరెడ్డి ఐఏఎస్‌కు రాజీనామా చేశారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) కోరుతూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు రాజీనామా లేఖ అందించారు. శ్రీ పి వెంకట్రామిరెడ్డి వీఆర్‌ఎస్‌ ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాజీనామా ఆమోదం అనంతరం శ్రీ వెంకట్రామిరెడ్డి మీడియాతో హైదరాబాద్ లో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోంది. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సీఎం శ్రీ కేసీఆర్‌ తెలంగాణను తీర్చిదిద్దుతున్నారు. ఈ  అభివృద్ధి మార్గంలో సీఎంతో ఉండాలనుకొని వీఆర్‌ఎస్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. రానున్న వంద సంవత్సరాలు తెలంగాణ గురించి ప్రజలు చెప్పుకొనే విధంగా రాష్ట్రాన్ని సీఎం శ్రీ కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారు. సీఎం మార్గనిర్దేశం ప్రకారం పని చేస్తాను’’ అని పేర్కొన్నారు.

Share This Post