సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి వరిధాన్యం కొనుగోలును ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.


సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి వరిధాన్యం కొనుగోలును ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.

* పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.

* ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కామెంట్లు-

* తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరిధాన్యం ఉత్పత్తి పెరుగుతూ వస్తుంది.
* ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నల కోసం రాష్ట్రంలోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, వాగులు, నదులపై చెక్ డ్యాముల నిర్మాణం వలన రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగాభూగర్భ నీటి వనరుల అభివృద్ధి చెంది రాష్ట్రంలో కోటి మెట్రిక్ టన్నుల వారి ధాన్యం ఒక సీజన్లోనే పండుతుంది.

* రాష్ట్రం ఏర్పడే నాటికీ జిల్లాలో లక్ష నుండి లక్షన్నర మెట్రిక్ టన్నుల వరిధాన్య పండగ ప్రస్తుతం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది.
* రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందించడం వలన, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం వలన అధిక పంట ఉత్పత్తి సాధ్యమైంది.
* గతంలో ఏసంగీ పంట అంటే వెనుక మడి ఎండకుండా పంట పండేది కాదు.
* ఇవాళ గుంట కూడా ఎండకుండా బంగారం లాగా రెండు పంటలు పండుతున్నాయి.
* గతంలో వాన కాలం వచ్చిందంటే వర్షాల కోసం రైతులు ముఖాలను మొగులు వైపు పెట్టి వర్షాల కోసం ఎదురుచూసేవారు.
* కానీ ఇప్పుడు వర్షాల కోసం ఎదురుచూడవలసిన అవసరం లేదు వాన కాలమైన, ఎండాకాలమైనా నీటికి కొదువ లేదు.
* రంగనాయక సాగర్ నింపుకొని ఆ నీటిని జిల్లాలోని అన్ని చెరువులను నింపి పొలాలకు నీటిని అందిస్తున్నాం.
* కొంతమంది హైదరాబాద్ లో కూర్చుని కాలేశ్వరం ఫలితం రాలేదని ఎద్దేవా చేస్తున్నారు.
* వారు హైదరాబాద్ ని వదిలి గ్రామాల్లో తిరిగితే పచ్చని పల్లెలలో ఉండే రైతులు సమాధానం చెప్తారు.
* భూగర్భ జలాల సమృద్ధిగా ఉండడంతో కొత్తగా బోర్లు వేయాల్సిన అవసరం లేక పల్లెల్లో బోరుబండ్లు, క్రేన్లు కనబడడం లేదు.
* రంగనాయక సాగర్ తో అన్ని గ్రామాల్లో చెరువులు, పంట పొలాలను నింపుతున్నాము. ఈసారి పెదవాగులోకి కూడా వీటిని వదిలి చెక్ డ్యాములను నింపనున్నాము.
* వరిధాన్యానికి క్వింటాలకు 2060 రూపాయల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
* చివరి గింజలకు వరి ధాన్యం కొనుగోలు చేస్తాము. రైతులందరూ తప్పనిసరిగా ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని అమ్ముకోవాలి.
* ధాన్యం ఎండేలా కోసిన వెంటనే రెండు రోజులు పొలంలో ఎండబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి.
* పరిధాన్యం కొన్న మూడు రోజుల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం నిధులను సమకూర్చింది.
* గడిచిన ఏసంగీకాలంలో వరిధాన్యాన్ని కొనమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే నూకలు ఎక్కువగా వస్తాయని రాష్ట్రంలోని ప్రజలతో నూకలు తినిపించాలని కేంద్ర మంత్రులు అవమానించారు.
* కానీ రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేసి వారం రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినం.
* ఈ వానకాలం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒక కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది.
* రాష్ట్రం దేశానికి ధాన్యకారంగా మారింది.
* రాష్ట్రంలో 20వేల వరి కోత యంత్రాలు, మరియు కూలీలు ఎంతమంది ఉన్నా కూడా వరిధాన్యం కోయడానికి ఎదురు చూసేంత విపరీతమైన ధాన్యం రాష్ట్రంలో పండింది.
* ఇదంతా తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం.
* ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప. రాజకీయం కోసం కాదు.

* అక్కడ సరిగ్గా వరిధాన్యం పండగ పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి మిల్లర్లు వరిధాన్యం కొనేందుకు రాష్ట్రానికి వస్తున్నారు.
* ఒకప్పుడు పని లేక ఇబ్బంది పడ్డ మనము. ఇప్పుడు ఇతర ప్రాంతాల వారికి వ్యవసాయ కూలీలుగా అవకాశాన్ని కల్పిస్తున్నాము.
* రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం రైతుల బావుల వద్ద మోటార్లకు మీటర్ పెట్టి రైతులకు బిల్లులు పంపియాలని అలా చేస్తేనే రాష్ట్రానికి ఇచ్చే 30 వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతున్నారు.
* పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకొని వేల కోట్ల రూపాయల కేంద్రం వద్ద నుండి తీసుకున్నారు.
* కానీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 65 లక్షల రైతుల క్షేమమే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 30 వేల కోట్ల రూపాయలను కూడా రైతుల కోసం వదులుకుని మోటార్లకు మీటర్ల పెట్టనన్నారు.
* కానీ కేంద్ర 30 వేల కోట్లు ఇవ్వకపోవడం మూలంగా రాష్ట్రంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగింది.
* తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి తీసుకున్న చర్యల మూలంగా రాష్ట్రం ఏర్పడే నాటికి ఒక ఎకరానికి 4 లక్షల రూపాయలు ఉన్న భూమి విలువ ప్రస్తుతం 40 నుండి 50 లక్షల రూపాయలకు పెరిగింది, రైతులకు విలువ పెరిగింది .
* పెద్ద రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రండి. ఆయిల్ ఫామ్ తోటలు పెంచడానికి ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుంది.
* ఆయిల్ ఫామ్ పెంపకంతో మూడు సంవత్సరాల తర్వాత రెట్టింపుకు మించి ఆదాయం వస్తుంది. మరియు నెల నెల జీతం లాగా ఆదాయం ప్రతి నెల వస్తుంది.
* పామాయిల్ పంట అమ్ముకోవడానికి ఎక్కడికో వెళ్ళకుండా నరమెట్ట లోనే 300 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది.
* ఆయిల్ ఫామ్ తో పాటు సెరికల్చర్ పంటలను పండించాలి. దానికి కూడా ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుంది.

* పరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో త్వరగా కొనుగోలు చేసేలా మరియు రైస్ మిల్లులో ధాన్యం దింపుకోవడానికి తరుగు ఇతరత్రా పేరుతో ఇబ్బంది పెట్టకుండా త్వరగా దింపుకునేలా, రైతులకు త్వరగా పేమెంట్ అందేలా ఆర్డీవోలు, తహసిల్దార్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ఐకెపి సిబ్బంది పర్యవేక్షించాలి.
issued by District Public Relations office siddipet

Share This Post