సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాల్లో కొత్త చెక్ డ్యామ్ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి.

– గ్రామాల వారిగా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపండి..

– ఆయకట్టు కాలువల పనుల పురోగతి , భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి..

– ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీష్ రావు గారు..

సిద్దిపేట , దుబ్బాక నియోజకవర్గంలోని అవసరం అయిన గ్రామాల్లో కొత్తగా చెక్ డ్యామ్ నిర్మించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం రాత్రి జిల్లా ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.. సిద్దిపేట , దుబ్బాక నియోజకవర్గంలో రంగనాయక సాగర్ , మల్లన్న సాగర్ ప్రాజెక్టులతో అన్ని చెరువుల్లో, చెక్ డ్యామ్ లో జలకళ సంతరించుకుంది. రాబోయే రోజుల్లో సిద్దిపేట ప్రాంతం సాగునీటి గోస తిరనుంది.. కరువు ప్రాంతం నుండి కల్పతరువు ఆవిష్కృతమైంది.. భవిష్యత్ లో ఇంకా చెక్ డ్యామ్ లు అవసరం అవుతాయన్నారు. సిద్దిపేట , దుబ్బాక నియోజకవర్గంలో కొత్తగా చెక్ నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నారాయణ రావు పేట మండలం, గోపులాపూర్ గ్రామం చిన్నకోడూర్ మండలంలోని కస్తూరి పల్లి , దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక మండలం నాగారం గ్రామం , తొగుట మండలంలోని వేకంట్రావ్ పేట , లింగం పేట గ్రామాలు , మిరుదొడ్డి మండలంలోని మోతె, మల్లుపల్లి, ఖాజీపూర్ గ్రామాల్లో చెక్ డ్యామ్ లు అవసరమని నా దృష్టికి వచ్చాయని మంత్రి అధికారులకు చెప్పారు.. వెంటనే ఈ గ్రామాల్లో నూతన చెక్ డ్యామ్ ల నిర్మాణాలకు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు..అందుకు అవసరం అగు నిధులు, ఎస్టిమేట్స్ సిద్ధం చేయాలని సూచించారు.. అదేవిధంగా జిల్లాలో ఆయకట్ట కాలువల పనులు పురోగతి పై అరా తీశారు.. పెండింగ్ లో ఉన్న కాలువల భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ బస్వారాజ్ , ఈఈ గోపాలకృష్ణ , ఏ ఈఈ ఖాజా తదితరులు పాల్గొన్నారు..

Share This Post