సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల

సిద్ధిపేట 02 జూన్ 2022 :

సీఎం కేసిఆర్ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగ ఫలంతో తెలంగాణ సాధించుకున్నామని, గత ఎనిమిదేళ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రాంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు చెప్పారు.
గురువారం సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి, జిల్లా ప్రగతి నివేదిక చదివి వినిపించారు.

ఎనిమిదేళ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ దార్శనికతతో అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతూ దేశంలోనే నెంబర్ వన్ గా సిద్ధిపేట జిల్లా నిలుస్తున్నదని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం జాతికి అన్నం పెట్టే రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయ రంగంలో కేసీఆర్ దిశానిర్దేశంతో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. విద్యా, వైద్య ఆరోగ్య రంగాల్లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన మార్పు తీసుకొచ్చినట్లు చెప్పారు. మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్నామన్నారు. హరిత హారం దేశానికే ఆదర్శమైందని, దళితులకు దళితబంధు పథకం దళితుల జీవితాల్లో కొత్త వెలుగు నింపబోతున్నట్లు చెప్పారు. తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చిన మార్పు అద్భుతం అని, దేశంలో అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతతో సతమతం అవుతుంటే, తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణగా మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆవిర్భావ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సీపీ శ్వేత, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లాలోని మండలాల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ముస్తాబాద్ సర్కిల్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి అమరులను స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం చిన్నకోడూర్ మండలం గంగాపూర్ గ్రామ రెడ్డి సంఘం శ్రీ మహంకాళమ్మ బోనాల జాతరలో మంత్రి హరీశ్ రావు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు చందలాపూర్ గ్రామంలో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణోత్స వేడుకల్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నకోడూర్ మండలం చౌడారం గ్రామ పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అక్కడి నుంచి సిద్ధిపేట మున్సిపాలిటీ లింగారెడ్డిపల్లి శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
======================

Share This Post