సినిమా థియోటర్లలలో గాంధీ చిత్రపదర్శకు పకడ్బంది ఏర్పాట్లు చేపట్టాలి పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ

సినిమా థియోటర్లలలో గాంధీ చిత్రపదర్శకు పకడ్బంది ఏర్పాట్లు చేపట్టాలి

పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ

0 0 0 0

     భారత స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల సందర్బంగా కరీంనగర్ జిల్లాలోని అన్ని సినిమాథియోటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ అన్నారు.

     శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు గరిమఅగర్వాల్,జీవి శ్యాంప్రసాద్, జిల్లా అధికారులు సినిమా యజమాన్యం, మేనేజర్లతో నిర్వహించిన సమావేశంలో  ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  భారత వజ్రోస్వాల్లో భాగంగా ఈనెల 9,10,11  16 నుండి 21 వరకు 13 థియేటర్లలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1.15 గంటల  వరకు గాంధిచిత్ర ప్రదర్శన జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా థియోటర్లలలో ప్రదర్శించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సినిమా థియేటర్లలో పరిసరాలు, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా  చూడాలన్నారు.

     అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థిని, విద్యార్థులకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 13 థియోటర్లలో గాంధీ చిత్రాన్ని  ఉచితంగా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. సినిమా విక్షణకు విద్యార్థులను స్కూల్ నుండి థియోటర్ల వరకు ఉచితంగా తీసుకుని వెళ్లి, తీసుకురావడానికి ఉచితంగా బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని,  సినిమా థియోటర్లలలో టాయిలెట్లు శుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. సినిమా ప్రదర్శన రోజున థియోటర్ల వద్ద ఫ్లెక్సీలు, ఆకర్శనియంగా తీర్చిదిద్దాలని అన్నారు.

     ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ శ్యాంపూసాద్ లాల్, సంబంధిత జిల్లా అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్ రావు గారు, సినిమా థియేటర్ యాజమానులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post