సిరిసిల్ల మానేరు రివర్ ఫ్రాంట్ అభివృద్దికి చర్యలు: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*సిరిసిల్ల మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధికి చర్యలు: జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి*

———————————

సిరిసిల్ల పట్టణంలోని మానేరు రివర్ ఫ్రంట్ ను సుందరంగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి తెలిపారు.

సిరిసిల్ల మానేరు రివర్ ఫ్రంట్ ను సుందరంగా తీర్చిదిద్దాలనే మంత్రి శ్రీ కేటీఆర్ మార్గదర్శనాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ ఈ రంగంలో అనుభవం కలిగిన కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు, స్థానిక మున్సిపల్, నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు.

మంత్రి కేటీఆర్ ఆలోచనలను జిల్లా కలెక్టర్ వారికి తెలియజేశారు. పర్యాటక స్వర్గధామంగా జిల్లాలో మానేరు రిఫర్ ఫ్రంట్ ను తీర్చిదిద్దాలనే ఆలోచనలో మంత్రి ఉన్నారని, వారి అంచనాలకు తగ్గట్టుగా రిఫర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం. ఉందన్నారు.

వరంగల్ భద్రకాళి లేక్ ను తీర్చిదిద్దిన ఫోటోలు, వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ అధికారి అజిత్ రెడ్డి, ఈఈ భీమా రావు లు జిల్లా కలెక్టర్ కు వివరించారు.

అంతకముందు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) అధికారుల బృందం స్థానిక నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో మానేరు రివర్ ఫ్రంట్ ను సందర్శించి, సుందరీకరణకు చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలోని మానేరు రివర్ ఫ్రంట్ ను సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కరకట్టను సందర్శించడానికి వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా మొక్కలు నాటాలని సూచించారు. అలాగే వేములవాడ గుడి చెరువు ను అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించి, గుడి చెరువుకు అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ బి.సత్య ప్రసాద్, నీటి పారుదల శాఖ ఈఈ అమరేందర్ రెడ్డి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, ఆర్టీఓ కొండల్ రావు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమీషనర్లు సమ్మయ్య, శ్యామ్ సుందర్ రావు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారీ, మున్సిపల్ ఈఈ సుచరణ్, తదితరులు పాల్గొన్నారు.
——————————————–

Share This Post