సివిల్స్ విజేత మహేష్ ను అభినందించిన – కలెక్టర్


నిజామాబాద్, మే 29 : ఇటీవల ప్రకటించిన సివిల్స్ లో విజేతగా నిలిచి అఖిల భారత సర్వీసులకు ఎంపికైన బోధన్ పట్టణానికి చెందిన కె.మహేష్ కుమార్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం తన ఛాంబర్ లో అభినందించారు. మహేష్ కుటుంబ నేపధ్యం, విద్యాభ్యాసం, సివిల్స్ కోసం సన్నద్ధమైన తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యుత్తమ స్థాయిలో 200 ర్యాంకు సాధించడం ఎంతో గొప్ప విషయమని కలెక్టర్ ప్రశంసించారు. మహేష్ కు స్వీట్స్ తినిపించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిని అధిష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీ ఎం హెచ్ ఓ డాక్టర్ సుదర్శనం, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కిషన్, ప్రతినిధులు పాల్గొన్నారు.
————————-

Share This Post