సివిల్స్- 2021 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి ఉచితంగా మెయిన్స్ కోచింగ్ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఐఏఎస్

సివిల్స్- 2021  ప్రిలిమ్స్ క్వాలిఫై  అయిన వారికి ఉచితంగా మెయిన్స్ కోచింగ్
బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఐఏఎస్

సివిల్స్ – 2021 ప్రిలిమ్స్ పాసైన బిసి యువతకు మెయిన్స్ కు అవసరమైన కోచింగ్  ఇస్తామని బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఐఏఎస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.  మెయిన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ కావడానికి అర్హులైన  వారికి అవసరమైన కోచింగ్ ను ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు.  సివిల్స్- 2021లో ప్రిలిమ్స్ సాధించిన యువత మెయిన్స్ కోచింగ్ కోసం ఈ నెల 15 తేదీ లోగా బీసీ స్టడీ సర్కిల్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. tsbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ లో తమ పేరు,  వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.  తమ వివరాలతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జాతి చేయాలి. మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్  040 -24071178లో సంప్రదించాలి.

Share This Post