సివిల్స్ -2022 ఉచిత కోచింగ్ దరఖాస్తు తేదీ పొడిగింపు

సివిల్స్ -2022 ఉచిత కోచింగ్ దరఖాస్తు తేదీ పొడిగింపు

బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి

సివిల్స్ -2022 రాయాలని ఆసక్తి ఉన్న బిసి యువతకు ఇస్తున్న ఉచిత కోచింగ్ కు దరఖాస్తు చేసుకునే తేదీని ఈ నెల 27 వరకు పొడిగిస్తున్నామని బిసి

స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి గారు

ఒక ప్రకటనలో వెల్లడించారు.  కోచింగ్, స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు.  సివిల్స్ రాయడానికి అర్హతగల యువత ఈ నెల 27 తేదీ లోగా వెబ్ సైట్ http://tsbcstudycircle.cgg.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.  మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్  040 -24071178లో సంప్రదించాలి.

Share This Post