సి.యం.ఆర్.డెలివరీ పెండింగ్ బకాయి సెప్టెంబర్ 20 లోగా పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్

పత్రికా ప్రకటన
సి.యం.ఆర్.డెలివరీ పెండింగ్ బకాయి సెప్టెంబర్ 20 లోగా పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్
నల్గొండ,సెప్టెంబర్ 13. వానాకాలం 2020-21 సంవత్సరంకు సంబందించి సి.యం.ఆర్ పెండింగ్ బకాయి ఈ నెల 20 లోగా డెలివరీ చేయాలని రైస్ మిల్లర్ లను అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులు,రైస్ మిల్లర్లు అసోసియేషన్ ప్రతినిధులతో వానాకాలం 2020-21 సి.యం.ఆర్ బకాయి లపై సమావేశం నిర్వహించి సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానా కాలం 2020-21 సంవత్సరం కు 3 లక్షల 92 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మిల్లులకు పంపినట్లు,2 లక్షల 63 వేల మెట్రిక్ టన్నుల సి.యం.ఆర్ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 2 లక్షల 38 వేల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ చేసి 90 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. మిగిలిన 25 వేల మెట్రిక్ టన్నుల సి.యం.ఆర్ బకాయి లు డెలివరీ సెప్టెంబర్ 20 లోగా పూర్తి చేయాలని ఆయన మిల్లర్ లను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వి.వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల డి.యం.నాగేశ్వరరావు, సహాయ పౌరసరఫరాల అధికారి నిత్యా నందం,రైస్ మిల్లర్ లు పాల్గొన్నారు.

——————————-

సహాయ సంచాలకులు,సమాచార శాఖ,నల్గొండ చే జారీ చేయనైనది

Share This Post