సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి

*29న పెద్దపల్లిలో లక్ష మందితో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్*

*ఆగస్టు 29న సమీకృత కలెక్టరేట్ నిర్మాణ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్*

*నూతన సమీకృత కలెక్టరేట్ ఎదురుగా పెద్దకల్వల శివారులోని అనువైన స్థలంలో బహిరంగ సభ నిర్వహణ*

*సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ*

*సీఎం కేసీఆర్ పర్యట ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి*

పెద్దపల్లి ఆగస్టు 23:- ఆగస్టు 29న పెద్దపల్లి జిల్లాలో లక్ష మంది ప్రజలతో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తో కలిసి ఆగస్టు 29న సీఎం సభ నిర్వహణ కోసం అనువైన స్థలాలను మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి పనుల ఫలితాలు ప్రజల వద్దకు అందుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు పూర్తవుతున్నాయని, వాటిని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభిస్తున్నారని మంత్రి తెలిపారు. పెద్దపెల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణ భవనాన్ని ఆగస్టు 29న, జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్ భవనాన్ని సెప్టెంబర్ 10న స్వయంగా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.

*సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నూతన సమీకృత కలెక్టరేట్ ఎదురుగా పెద్దకల్వల శివారులోని అనువైన స్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, గత 8 సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని మంత్రి తెలిపారు* సీఎం కేసీఆర్ పర్యటన, భారీ బహిరంగ సభ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. సభ వద్ద వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధుల కోసం అవసరమైన మేర పార్కింగ్ ఏర్పాటు, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో భద్రత పకడ్బందీగా ఉండే విధంగా , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ అనే పద్యంలో సభాస్థలి ఏర్పాట్ల పనులు రేపటి నుంచి ప్రారంభిస్తామని, జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, పోలీస్ కమిషనర్ ,డిసిపి స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పగడ్బందీగా చేస్తామని మంత్రి పేర్కోన్నారు

.*సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ*

సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించేందుకు జిల్లాకు వస్తున్న సీఎం కేసీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టరేట్ భవనంలో సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. సీఎం కేసీఆర్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో సభాస్థలి వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా ఏర్పాటు చేయాలని, సీఎం కేసీఆర్ పర్యటించే రోడ్డు మార్గం ఇరువైపులా అందమైన మొక్కలు నాటాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నూతన సమీకృత కలెక్టరేట్ భవనం పూర్తిగా శుభ్రం చేయాలని, సీఎం పర్యటన సమయానికి కలెక్టరేట్ భవనాన్ని పూర్తి హంగులతో అలంకరించాలని కలెక్టర్ సూచించారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లాలో అత్యవసర సెలవులు మినహాయించి మిగిలిన సెలవులు రద్దు చేస్తున్నామని, జిల్లా అధికారులు, ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని , సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, సుద్దాల సుధాకర్ వాస్తు పండితులు, గణపతి రెడ్డి ఈ.ఎన్. సి., డిసిపి రూపేష్, డిసిపి అడ్మిన్ అఖిల్ మహాజన్,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post