ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రతి మంగళ, శుక్రవారాలలో జిల్లాలోని అన్ని గ్రామాలలో డ్రై డే కార్యక్రమం నిర్వహించేలా సంబంధిత శాఖల సమన్వయంతో అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మంగళవారం జిల్లాలోని బెజ్టూర్ మండలంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి సులుగుపల్లి గ్రామంలో డ్రై డే నిర్వహించకపోవడంతో [గ్రామ పంచాయతీ కార్యదర్శికి, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించనందున బెజ్ఞార్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రతి కుటుంబం వారి నివాసాలలో వివిధ రకాల పాత్రలలో ఉన్న నీటితో పాటు ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం ద్వారా దోమలు వృద్ధి చెందకుండా నివారించి వాటి వలన వ్యాప్తి చెందే విషజ్వరాలైన మలేరియా, టైఫాయిడ్, డెంగ్యు ఇతరత్రా వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. విధులలో అలసత్వం, నిర్లక్ష్యం వహించిన మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వరుణ్‌రెడ్డి చింతలమానెపల్లి, కౌటాల మండలాలలో
ఆకస్మిక తనిఖీ నిర్వహించి కౌటాల మండలం మొగడ్ దగడ్ గ్రామపంచాయతీలో డ్రై డే నిర్వహణ సక్రమంగా లేనందున ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శిని, చింతలమానెపల్లి మండలం అదేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని విధుల నుండి సస్పెండ్ చేయడంతో పాటు కాగజ్‌నగర్ మండలం కదంబా, గన్నారం గ్రామపంచాయతీల కార్యదర్శి, కౌటాల మండలం వీర్దండి గ్రామ పంచాయతీ కార్యదర్శి, కౌటాల, చింతలమానెపల్లి, కాగజ్‌నగర్ మండలాల మండల పంచాయతీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
జల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్ కెరమెరి మండలంలో డ్రై డే కార్యక్రమంపై ఆకస్మిక తనిఖీ నిర్వహించగా
కెరమెరి గ్రామ పంచాయతీ కార్యదర్శి కార్యక్రమానికి 7 గం॥[లకు హాజరు కావలసి ఉండగా 9 గం॥ల వరకు కూడా
విధులకు హాజరు కానందున షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు.
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పొర నంబంధాల అధికారిజే జారీ చేయడమైనది.