సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి:జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి:జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి

——————————-
వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ, పంచాయితీ రాజ్ అధికారులు సమన్వయం చేసుకుంటూ పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ *శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు.

మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి గారి అధ్యక్షతన జిల్లా స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు.

విద్య, వైద్యం, ప్రణాళిక, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, నిర్మాణ పనుల స్టాండింగ్ కమిటీలకు జడ్పీ చైర్ పర్సన్ గారి అధ్యక్షత వహించగా, వ్యవసాయం పై వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మహిళా సంక్షేమ పై తంగలపల్లి జడ్పీటిసి పూర్మాని మంజుల, సాంఘిక సంక్షేమం పై బోయినపల్లి జడ్పీటీసీ కత్తెర పాక ఉమ కొండయ్య గారు స్టాండింగ్ కమిటీలకు అధ్యక్షత వహించారు.

సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి గారు మాట్లాడుతూ… సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, పారిశుధ్య అంశాలపై అధికారులు  శ్రద్ధ చూపాలన్నారు. రహదారులు, మురుగు కాలువలు,  నివాస ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్య లు చేపట్టాలన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌,  ప్రబలకుండా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలన్నారు. ప్రతీ శుక్ర, మంగళవారం డ్రైడే పాటించాలన్నారు. కొవిడ్‌ కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్‌ డోస్‌ అందరికి అందేలా చూడాలని, రెసిడెన్షియల్‌ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందే విధంగా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. సంక్షేమ హాస్టల్‌లను తనిఖీ చేయాలని సూచించారు.

మిషన్‌ భగీరథ ట్యాంకులు శుభ్రం చేసి పైపులైన్‌  లీకేజీలను అరికట్టాలని అన్నారు.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ సాధ్యమైనంత త్వరగా టెక్స్ట్ బుక్ లు, యూనిఫాం లు పంపిణీ పూర్తి చేయాలన్నారు . మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన మౌలిక సదుపాయాలు కల్పన పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు.

వానాకాలంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ అధికారులు చైతన్యం చేయాలని అన్నారు.
అలాగే రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.

సమృద్ధిగా కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని అన్ని చెరువులు తలపిస్తున్నందున చెరువులు, కుంటలలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ మత్స్య శాఖ అధికారులకు సూచించారు.

జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు గర్భిణీలకు సంతులిత పోషక ఆహారం అందించాలని సంక్షేమ అధికారులకు సూచించారు. జిల్లాలోని నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సకాలంలో పనులు పూర్తయ్యేలా అన్ని ప్రభుత్వ శాఖలు ఇంజనీరింగ్ అధికారులు కృషి చేయాలని అన్నారు.

జిల్లాలో  మహిళలపై వేధింపులు, గృహ హింస,వరకట్నం, లై0గిక దాడులు, ఫోక్సో, సీనియర్ సిటీజన్స్ పై వేధింపులు,బాల్య వివాహాలు, తదితర సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు సఖి కేంద్రం ద్వారా అందించే సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సంక్షేమ అధికారులు, కేంద్ర నిర్వాహకులు సూచించారు

బాధిత మహిళలకు సరైన న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని సూచించారు. సమస్యలతో సఖి కేంద్రానికి వస్తున్న మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందే విధంగా సేవలు అందించాలన్నారు.

సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌతమ్ రెడ్డి, కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post