సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం మెరుగుకు సత్వర చర్యలు చేపట్టాలి…

ప్రచురణార్థం

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం మెరుగుకు సత్వర చర్యలు చేపట్టాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 8.

భారీ వర్షాలకు గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇళ్ళ మధ్య నీరు నిల్వ ఉండకుండ సత్వర చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలో విద్య వైద్యం తాగునీరు పారిశుద్ధ్యం హరితహారం వంటి పలు కార్యక్రమాలపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వర్షాలు తగ్గాయని వరద తగ్గుముఖం పట్టిందని అశ్రద్ధ తగదని పారిశుద్ధ్యం పై ప్రధాన దృష్టి పెట్టాలని మెరుగుకు సత్వరం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

పాఠశాలల్లో, ప్రభుత్వ భవనాలలో నీరు నిల్వ ఉండకుండా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలకు సరఫరా చేసే త్రాగు నీటిని మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు పరీక్షించి సరఫరా చేయాలన్నారు. ఎంపీడీవోలు ఎంపీడీవోలు మధ్యాహ్న భోజన పథకంలో అశ్రద్ధ తగదన్నారు.

వైద్య శాఖ అధికారులు గ్రామ స్థాయిలో పర్యటించి జ్వరాలు రాకుండా గ్రామపంచాయతీ సిబ్బందితో త్రాగునీరు క్లోరినేషన్ చేయించడం, పంచాయతీ సిబ్బందితో పారిశుధ్యం మెరుగు పరచడం, నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెట్టాలన్నారు.

బావులు బోర్ల నుండి నీరు సరఫరా చేసేటప్పుడు క్లోరినేషన్ చేయాలని లేనిపక్షంలో వేడిచేసి చల్లార్చిన నీటిని త్రాగునీటి కొరకు వినియోగించాలని ప్రజలకు తెలియజెప్పాలన్నారు.

నిల్వ వున్న నీరును తొలగించ లేనిపక్షంలో గంబుషియా చేప పిల్లలను విడిచిపెట్టాలని, మురుగు నీటిలో ఆయిల్ బాల్స్ వేయించాలన్నారు.

శిథిల భవనాలు క్రింద చెట్ల కింద విద్యార్థులను కూర్చోబెట్టి రాదని మధ్యాహ్న భోజన పథకంలో శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు.

జిల్లాలోని 21 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలోనూ 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ల లోనూ నిర్మితమైన సబ్ సెంటర్ లలోనూ జ్వరాల మందులతోపాటు పాము తేలు వంటి విష పురుగులు కాటుకు మందులు అందుబాటులో ఉంచుకోవాలి అన్నారు. 2019లో గార్ల మండలం లో డెంగ్యూ జ్వరాలు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించాలన్నారు వైరల్ ఫీవర్స్ శాంపిల్స్ సేకరించి నిర్ధారణ కేంద్రానికి తరలించాలని అన్నారు. కోవిద్ వ్యాక్సిన్ పై మాట్లాడుతూ ప్రతిరోజు 400 వ్యాక్సినేషన్ చేయాలన్నారు పాజిటివ్ కేసులు ఉన్నచోట టెస్ట్ లు ఎక్కువగా చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు.

హరిత హారంలో ప్రతిరోజు 90 వేల ఫిట్టింగ్ జరగాలని 75 వేల మొక్కలను నాటాలి అన్నారు గ్రామానికి ముందు వెనక అవెన్యూ ప్లాంటేషన్ తప్పనిసరిగా చేపట్టాలన్నారు హరితహారం లక్ష్యాలు సాధించాలంటే పేమెంట్ సకాలంలో జరగాలని ఆ తరహాలో చర్యలు తీసుకోవాలన్నారు నాలుగువందల మొక్కలు నాటిన తోట తప్పనిసరిగా వాచర్ ను నియమించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జడ్పీ సీఈఓ రమాదేవి డిఆర్డిఎ పిడి సన్యాసయ్య జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ మిషన్ భగీరథ అధికారి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post