సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి

ఖాళీ స్థలాలలో నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలి

ఇండ్లు పరిసర ప్రాంతలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి- పేరుకుపోయిన చెత్తను తొలగించాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

000000

     డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాదులు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.

     సోమవారం కలెక్టర్ ఆడిటోరియంలో సీజనల్ వ్యాదుల నియంత్రణ, చేపట్టవలసిన చర్యల కార్యచరణపై మేయర్ వాయిస్ సునీల్ రావు తో కలసి అధికారులు, సానిటేషన్ బృందాలతో సమీక్షించారు.ఇటీవల కురిసిన బారీ వర్షాల వలన మారిన వాతావరణ పరీస్థీతుల కారణంగా జలుబు, జ్వరం, మలేరియా లాంటి సీజనల్ వ్యాదులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూడాలని సానిటేషన్ బృందాలను కలెక్టర్ ఆదేశించారు.  పారిశుద్ద్య నిర్వహణ కొసం ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టాలని ఆయన అన్నారు. పారిశుద్ద్య డ్రైవ్ చేపట్టాలని అన్నారు. అర్హులైన వారందరికీ బుస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అర్హులైన అందించాలని అన్నారు.

     నగర మేయర్ వై.సునీల్ రావు మాట్లాడుతూ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఖాళీ స్థలాలలో నీరు నిలువ ఉన్నట్లయితే ఆయిల్ బాల్స్ వేయాలని, కూలర్లు పూల కుండీలు పాత టైర్లు కొబ్బరి బోండాలలో నీరు నిలువ ఉండకుండా చూడాలని, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను అవగాహన కల్పించాలని అన్నారు. సీజనల్ వ్యాదులపై నిధులను కేటాయించి ఖర్చు చేయడం జరిగిందని, అగస్టు, సెప్టెంబర్ మాసం వరకు నగర పాలక సంస్థ జవాన్ లు, పిడి మెప్మా , కార్పోరేటర్లు అందరి సహాకారంతో పనిచేయాలని, సీజనల్ వ్యాదులు వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, దోమలు కుట్టకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజలందరూ డ్రై డే ను తప్పకుండా పాటించాలని అన్నారు.

     ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, పిడి మెప్మా రవీందర్, సానిటేషన్ బృందాలు తదితరులు పాల్గోన్నారు.

Share This Post