*సీజనల్ వ్యాధులు ప్రబలకుండా* *నియంత్రణకు చర్యలు తీసుకోవాలి* *-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు.* *మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సి.ఎస్.తో కలిసి వీడియో సమావేశం

*సీజనల్ వ్యాధులు ప్రబలకుండా* *నియంత్రణకు చర్యలు తీసుకోవాలి*  *-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు.*  *మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సి.ఎస్.తో కలిసి వీడియో సమావేశం

ప్రచురణార్థం

——————————-
సిరిసిల్ల 25, జూలై 2022
——————————-
ముందస్తు జాగ్రత్తలతో డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, నియంత్రణకు చర్యలు తీసుకోవాలనీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టీ.హరిష్ రావు తెలిపారు.

సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లు, సి.ఎస్., రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా నియంత్రణ, పాఠశాలల్లో, హాస్టళ్లలో ఆహార నాణ్యత ప్రమాణాలు, కోవిడ్ పరిస్థితులపై, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై రాష్ట్రంలోనీ జిల్లా కలెక్టర్ లు, అడిషనల్ కలెక్టర్ లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ వీడియో సమావేశంకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా స్థానిక అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, zp ceo గౌతం రెడ్డి, dpo రవీందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, డీఈఓ డి రాధా కిషన్, మున్సిపల్ కమిషనర్ లు, ఇతర జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, డెంగ్యూ, మలేరియా కేసులు నమోదు అవుతున్నాయని, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ప్రతి శుక్రవారం జిల్లాలోని గ్రామాల్లో, ఆదివారం పట్టణాలలో ఇంటింటికి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రజలకు వివరించాలని, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలనీ, డెంగ్యూ, మలేరియా కేసులను ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స చేయడానికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని, మందులు ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రచారం చేయాలని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు మోడల్ స్కూల్స్ లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందే విధంగా కలెక్టర్లు,ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, ఆగస్ట్ నాటికి ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించి 12 నుంచి 17 వయస్సు గల విద్యార్థులకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని తెలిపారు, మురికి కాలువలు పరిశుభ్రం చేయాలని, మిషన్ భగీరథ ట్యాంకులను శుభ్రం చేయాలని, పైప్ లైన్ లీకేజీలను అరికట్టాలని సూచించారు. గ్రామాలలో ప్రజలు కాచిన నీళ్లు తాగాలని ప్రచారం చేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వంద శాతం వ్యాక్సినేషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలనీ, అధికారులు తరచూ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని, ప్రభుత్వ వసతి గృహాలలో ఉన్న పాత బియ్యం స్టాక్ స్థానంలో నూతనంగా బియ్యం సరఫరా చేస్తున్నామని, వాటిని వినియోగించు కోవాలని సూచించారు. ప్రతి పాఠశాలకు ఒక అధికారికి బాధ్యత అప్పగించి ప్రతివారం ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు.

అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెంగ్యూ, మలేరియా జిల్లాల వారీగా ఉన్న కేసులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, శాఖలు చేపట్టవలసిన కార్యక్రమాలు, వాక్సినేషన్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

*డ్రై డే పకడ్బందీ గా నిర్వహించాలి:జిల్లా* *అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్*

*వీడియో సమావేశం అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ అధికారులతో సమీక్షిస్తూ,

* సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, వైద్య. ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, మునిసిపల్ అధికారులు సమన్వయంతో డెంగ్యూ, మలేరియా, సీజనల్ కేసులు ఎక్కడ వస్తున్నాయి అనే సమాచారం షేర్ చేసుకొని అవగాహన కలిగి ఆ ప్రాంతంలో దృష్టి పెట్టీ వ్యాధులను అరికట్టాలని, పెరగకుండా కట్టడి చేయాలని తెలిపారు.

అర్బన్, రూరల్ ఏరియా లలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని, రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్ లలో నాణ్యమైన ఆహారం అందించాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, భోజనం వేడి వేడిగా అందించాలని, కూరగాయలు, వంట సామాగ్రి విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అధికారులు తరచుగా హాస్టల్స్ ను సందర్శించి పరిశీలించాలని, సాంస్కృతిక సారథి కళాకారులు వైద్య అధికారుల సమన్వయంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను గ్రామాలలో తెలియజేయాలని, డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలను ముందుగా గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలో ప్రతి మంగళవారం, శుక్రవారం పారిశుద్ధ్య డ్రైవ్ తప్పని సరిగా నిర్వహించాలని, దోమల నివారణకు, తీసుకోవాల్సిన చర్యల పై ప్రజలకు తెలపాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి నమ్మకం కల్పించాలని తెలిపారు. మిషన్ భగీరథ నీరు డైనింగ్ హాల్ వరకు వచ్చే విధంగా సింటెక్స్ ట్యాంక్ నుండి ఏర్పాటు చేయలని, బూస్టర్ డోస్, వాక్సినేషన్ పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు.

Share This Post