సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు.

ప్రెస్ రిలీజ్. తేది 21.08.2021

సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు.

బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి సీజనల్ వ్యాధులను తగ్గించాలని సూచించారు. జిల్లాలో pvc ఇమ్యునైజేషన్ 68 శాతం పూర్తయిందని చెప్పారు. వంద శాతం పూర్తి చేయాలని కోరారు. అంగన్వాడి కేంద్రంలో అంగన్ వాడి డే తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొన్నారు. కరోనా, డెంగి, మలేరియా వంటి వ్యాధులు రాకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు జరిగే విధంగా వైద్య సిబ్బంది చూడాలని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోతు‌రే, జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్, ఏరియా ఆస్పత్రి సూపరిండెంట్ లు డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, జిల్లా ఐసిడిఎస్ అధికారిని సరస్వతి, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ మోహన్ బాబు, అధికారులు పాల్గొన్నారు. Dpro..Kama reddy.

Share This Post