సీజన్ ప్రారంభమైనందున కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుండి దాన్యం కొనుగోలు చేయుటకు సర్వం సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియపై మంగళవారం కలెక్టరేట్ నుండి పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, వ్యవసాయ, సహాకార, జిసిసి, _మార్కెటింగ్, డిఆర్డిఓలతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు టార్పాలిన్లు, మాయిశ్చర్, తూకపు యంత్రాలు, గన్నీ బ్యాగులు, ప్యాడి క్లీనర్లు సిద్ధంగా ఉండాలని చెప్పారు. నాణ్యత పాటించు విధంగా ఏఈఓ, ఏఓలు రైతులను సిద్ధం చేయాలని, రైతువేదికల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించు విధంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో 154 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయనున్నందున ధాన్యం అధికంగా వచ్చే కేంద్రాల్లో అదనపు యంత్రాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు ఎగుమతి చేసేందుకు ప్రతి మిల్లును జియో ట్యాగింగ్ చేయాలని చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో సౌకర్యాలు కల్పనపై నివేదికలు ఇవ్వాలని చెప్పారు, హమాలు, లారీలు, గన్నీ, బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల డియంను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను సరళతరం చేసేందుకు రైతుల యొక్క భూ వివరాలను ఓపియంఎస్ వెర్ల్యాండ్లో నమోదు చేసేట్లు చూడాలని చెప్పారు. రెండు రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలకు గన్నీ సంచులు సరఫరా చేయాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు వేచి ఉంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం వరకు అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు దృవీకరణ చేసి తనకు నివేదికలు ఇవ్వాలని చెప్పారు. సమయం లేదని, యుద్ధ ప్రాతిపదిక ఏర్పాట్లు ప్రక్రియ పూర్తి కావాలని చెప్పారు. రైతు సమన్వయ, వ్యవసాయ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ముందు ధాన్యం ఆరబెట్టి, చెత్త, తాలు, పొల్లు, పొట్టు, మట్టి లేకుండా శు బ్రపరిచి తెచ్చే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల విక్రయాలు నిర్వహణ సులభమవుతుందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తరువాత నాణ్యత లేదని జాప్యం చేయకుండా రైతులు ఇంటి వద్దనే ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తెచ్చే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రద్దీ లేకుండా విక్రయాలు సక్రమంగా జరిగేందుకు ముందస్తుగా రైతులకు టోకెన్లు జారీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. టోకెన్లో ఇచ్చిన తేదీల్లోనే విక్రయాలు నిర్వహణకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారులకు సమగ్ర అవగాహన ఉండాలని, ఏదేని పిర్యాదు వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా చేయు విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. పక్క రాష్ట్రాలు, జిల్లాల నుండి మన జిల్లాకు ధాన్యం రాకుండా బోర్డర్ చెక్పోస్టులలో పటిష్ట పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ టెలి కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ప్రసాద్, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, సహాకార అధికారి వెంకటేశ్వర్లు, జిసిని జిల్లా మేనేజర్ వాడి, పర్యవేక్షకులు నరేందర్, డిఆర్డిఓ మధుసూధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Share This Post