సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణ పనులకు వర్షాకాలంలో అంతరాయం లేకుండా మే నెలాఖరు వరకు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్యకార్యదర్శి డాక్టర్ రజత్కుమార్, సియంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు.

శనివారం అశ్వాపురం మండలం, అమ్మగారిపల్లి గ్రామం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలనకు హైదరాబాదు నుండి హెలికాఫ్టర్ లో ఇంజినీర్ ఇన్ ఛీఫ్ మురళీధర్రెడ్డి, ఎల్ అండ్ టి సిఈఓ సుబ్రమణ్యంలతో కలిసి మద్యాహ్నం 1.30 గంటలకు విచ్చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇరిగేషన్, ఎల్ అండ్ టి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని చెప్పారు. 3480 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాలలోని 63 గ్రామాల పరిధిలోని 3121.14 ఎకరాలు భూమి అవసరం కాగా ఇప్పటి వరకు 2640.39 ఎకరాల భూ సేకరణ ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు. ఇరిగేషన్ శాఖకు 85.18 ఎకరాల భూమి అప్పగించినట్లు చెప్పారు. పరిహారం క్రింద 112.77 కోట్ల రూపాయలు చెల్లింపు చేశామని, ఇంకకూ 740 ఎకరాలు అప్పగించాల్సి ఉందని, దీనికి పరిహారం 59.20 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నట్లు వివరించారు. వర్షాకాలం వరకు ప్రాజెక్టు పనులకు అంతరాయం లేకుండా తదుపరి నిర్మాణ పనులు జరిగేందుకు వీలుగా మే నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని చెప్పారు. ప్రాజెక్టు అవసరాలకు కావాల్సిన ఇసుక అందచేశామని చెప్పారు. నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరిగేందుకు కావాల్సిన యంత్రాలను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ప్రాజెక్టుకు 40 కిమీ కుడి కాలువ, 50కిమీ ఎడమ కాలువ నిర్మించాల్సి ఉందని చెప్పారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షణబండ్స్ నిర్మించనున్నట్లు చెప్పారు. 36.5 టియంసిల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు 65 గేట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలోని 6.45 లక్షల ఎకరాలకు సీతారఎత్తిపోతల పథకం ద్వారా నిరంతరాయంగా పంట పొలాలకు సాగునీరందించనున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు ప్రాధాన్యతను, అవసరాలను దృష్టిలో ఉంచుకుని వేగవంతం చేయాలని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి 322 ఎకరాలు సిఏ భూమి అప్పగించాల్సి ఉండగా 222 ఎకరాలు సేకరణ జరిగిందని, మిగిలిన 100 ఎకరాలు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. నిర్మాణ పనుల్లో ఏమైనా సమస్యలుంటే తక్షణమే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని, పనులల్లో జాప్యం జరగడానికి వీల్లేదని చెప్పారు. బ్లాస్టింగ్ పనులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏర్పాటు చేయనున్న యంత్రాలు వేడి నుండి రక్షణకు ఐస్ ప్లాంట్స్ నిర్మించాలని చెప్పారు. నిర్మాణ పనులకు సంబంధించి ప్రతి రోజు నిర్దేశించిన విధంగా షెడ్యూలు తయారు చేయాలని, షెడ్యూలు ప్రకారం పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం ఎల్ అండ్ టి ప్రాజెక్టు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు అవలంబాల్సిన కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇరిగేషన్ అధికారులు పవర్హెయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన అధికారులు పనులు పరిశీలన, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అంనతరం సాయంత్రం 4.3 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లారు.

 

ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ అనుదీప్, ఖమ్మం కలెక్టర్ విపి గౌతం, ఐటిడిఏ పీఓ పోట్రు గౌతం, ఇరిగేషన్ సిఈ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈలు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎల్ అండ్ టి డిజియం రజనీష్ చౌహాన్ తదితరులు

 

పాల్గొన్నారు.

 

Share This Post