సీతారామ ప్రాజెక్టు ద్వారా ఎర్రుపాలెం మండలం రైతాంగానికి సాగునీటి వసతి అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు, 06 ఖమ్మం:

సీతారామ ప్రాజెక్టు ద్వారా ఎర్రుపాలెం మండలం రైతాంగానికి సాగునీటి వసతి అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు. సోమవారం మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఎర్రుపాలెం, జమలాపురం, బుచ్చిరెడ్డిపాలెం, బనిగండ్లపాడు, మీనవోలు, రామన్నపాలం క్లస్టర్లలో ఒక్కొక్కటి 22 లక్షల వ్యవయంతో నూతనంగా నిర్మించిన రైతువేదికలను మంత్రి ప్రారంభించారు. అనంతరం 16 లక్షల వ్యయంతో సఖినవీడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండువేలకు పైగా రైతుదేదికలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మన జిల్లాలో 129 క్లస్టర్లలో రైతువేదికలను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి తెలిపారు. ప్రతి రైతువేదికలో రైతుల ముఖాముఖి కార్యక్రమాలు జరగాలని పంట పద్ధతులు పంటమార్పిడీలు, వ్యయసాయంలో మెళకువలు రైతువేదికల ద్వారా రైతులకు అందించాలని మంత్రి తెలిపారు. జిల్లాలో నూతనంగా ప్రారంభించుకున్న అన్ని రైతువేదికలను వినియోగంలోకి తేవాలని వ్యవసాయ శాఖాధికారులు, శాస్త్రవేత్తలు ప్రతి క్లస్టర్లోని రైతువేదికలో రైతులకు అందుబాటులో ఉండి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రతి అంశం రైతులకు తెలియపర్చి ఆధునిక సాగుపద్ధతిని అవలంభించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించాలని మంత్రి వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. గతంలో ఎర్రుపాలెం మండలం పర్యటనకు వచ్చిన సందర్భంలో జమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సరియైన రోడ్డు సౌకర్యం లేదని విన్నవించిన మేరకు మూడున్నర కోట్లతో రోడ్డు అభివృద్ధి పర్చడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఎర్రుపాలెం మండలంలోని చివరి ఆయకట్టు రైతాంగానికి ఇప్పటికే గత రెండెళ్లుగా సాగర్ జలాలను సకాలంలో అందిస్తున్నామని శాశ్వత పరిష్కార దిశగా సీతారామ ప్రాజెక్టు ద్వారా ఎర్రుపాలెం మండలానికి సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను చేపట్టిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సఖినవీడు గ్రామంలో గ్రామ పంచాయితీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం గ్రామ ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ సఖినవీడు గ్రామంలో పలు సమస్యలను తన దృష్టికి తెచ్చారని గ్రామ పంచాయితీకి సంబంధించిన పారిశుధ్య పనులకు గాను కృషియల్ నిధుల నుండి అవసరమైన మొత్తాన్ని మంజూరు చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు. మండలంలో నూతనంగా ఏర్పడిన అన్ని గ్రామ పంచాయితీలకు శాశ్వత కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గౌరవ ముఖ్యమంత్రివర్యులు పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు రైతాంగం సంక్షేమం కొరకు అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అసంఘటితంగా ఉన్న రైతాంగ రంగాన్ని సంఘటిత పర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతువేదికల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని, మన జిల్లాలో అన్ని రైతువేదికలను ఏర్పాటు చేసుకొని రైతులకు అందుబాటులోకి తేవడం జరిగిందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా, రైతు బందు ద్వారా రైతు పంట పెట్టుబడి, సకాలంలో ఎరువులు, విత్తనాలను అందించడం ద్వారా నేడు రైతాంగం ఏ సమస్యలేకుండా వ్యవసాయం చేసుకొని రైతు కుటంభాలన్ని సుఖ సంతోషాలతో ఉన్నాయని ఆయన తెలిపారు.

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడతూ పంచాయితీరాజ్ వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చి గ్రామ పంచాయితీలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసిందని, గ్రామాలకు ప్రతి నెల విడుదలవుతున్న నిధులను సద్వినియోగపర్చుకొని గ్రామాభివృద్ధి సాధించాలని ఆయన అన్నారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున జిల్లాలో 129 క్లస్టర్లలో రైతువేదికలను ఏర్పాటు చేసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతువేదికల ఏర్పాటు. ద్వారా రైతులు స్వయంగా ముందుకు వచ్చి వ్యవసాయ అంశాలపై చర్చించుకునే విధంగా వ్యవసాయ శాఖాధికారులు రైతువేదికలను నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ అన్నారు. గ్రామ పంచాయితీలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో గ్రామ పంచాయితీలకు ప్రతి నెల నేరుగా విధులను విడుదల చేస్తుందని, పల్లె ప్రగతి ద్వారా గ్రామాల పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలను చేపట్టిందని, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో గ్రామ పాలనలో గ్రామ స్వరాజ్యం తేవాలని కలెక్టర్ అన్నారు.

కార్యక్రమంలో సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డి.సి.సి.బి వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఎర్రుపాలెం ఎం.పి.పి దేవరకొండ శిరీష, జడ్పీ, టి.సి శీలం కవిత, ఎం.పి.టి.సి షేక్ మస్తాన్వలీ, ఆయా గ్రామాల సర్పంచ్లు, రైతుబంధు సమితి కన్వినర్లు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీమతి విజయనిర్మల, మండల ప్రత్యేక అధికారి యాదయ్య, వ్యవసాయ శాఖ ఏ.డి కొంగర వెంకటేశ్వరరావు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సంబంధిత శాఖల మండల, గ్రామ స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post