సీపీఆర్ శిక్షణతో ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చు
: జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి
జిల్లాలో కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై విస్తృత అవగాహన పెంపొదించుకోవడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చునని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో
కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) పై సిరిసిల్ల అర్బన్, ఇల్లంతకుంట, కొనరావుపేట, తంగళ్ళపల్లి మండలాల పరిధిలోని ఏఎన్ఎంలు ,ఆశా లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ మాట్లాడుతూ..జీవనశైలి మారడం,
ఒత్తిడి తో కూడిన జీవితం వల్ల
గతంలో కంటే గుండెపోట్లు పెరిగాయన్నారు. గుండె పోటు వచ్చినప్పుడు ఏం చేయాలో అవగాహన లేకపోవడం వల్ల గుండె పోటు కు గురైన వారి లో ఎక్కువ మంది చనిపోతున్నారని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్ని దానాలలో కెల్లా ప్రాణదానం మిన్న అని భావించి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులతో సహా ఇతర ఫ్రంట్ లైన్ ప్రభుత్వ శాఖల సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలను ప్రాణాలకు తెగించి ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం anm లు, ఆశాలు ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో అందిస్తున్న సేవలతో పాటు లైఫ్ సేవింగ్ టెక్నిక్ ల ద్వారా గుండెపోటు గురయ్యే వారి ప్రాణాలను కాపాడుతూ వారి కుటుంబాలకు వెన్నుదన్నుల నిలవాలని ఆమె సూచించారు.
జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ…
ప్రజల యొక్క విలువైన ప్రాణాలను కాపాడటమే సీపీఆర్ లక్ష్యం అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ,ఆహారపు అలవాట్లు మారిపోవడం వల్ల, పని ఒత్తిడి కారణంగా షాక్స్ వస్తున్నాయన్నారు. కరోనా తర్వాత కూడా కార్డియాక్ అరెస్టులు పెరిగాయన్నారు. ప్రజలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్య రక్షణ కోసం లైఫ్ స్టైల్‌ను మార్చుకోవాలన్నారు. తద్వారా అవాంఛిత మరణాలను నిరోధించవచ్చునన్నారు.
సీపీఆర్ ప్రక్రియపై అందరికీ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య మాట్లాడుతూ..
అకస్మత్తుగా గుండె ఆగిన సమయంలో బాధితుల ప్రాణాలు రక్షించేందుకు ఉపయోగపడే సీపీఆర్ శిక్షణ పట్ల ఫ్రంట్ లైన్ వర్కర్స్ కే కాకుండా ప్రజలందరికీ అవగాహన ఉండాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ,జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు CPR శిక్షణ లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు , జిల్లా డిప్యూటీ వైద్యాధికారిని డాక్టర్ రజిత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.