ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం 15-3-2023న ప్రారంభం అవగా, రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ఎల్.బి.నగర్ లోని శివాని జూనియర్ కాలేజీలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గదులలో తిరుగుతూ, పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా గమనించారు. విద్యార్థుల హాజరు గురించి కలెక్టర్ ఆరా తీశారు. సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్ లకు కలెక్టర్ సూచించారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన మీదట విద్యార్థులను లోనికి అనుమతించాలని అన్నారు. ప్రతి కేంద్రం వద్ద మహిళా పోలీసు సిబ్బంది విధుల్లో ఉండేలా చూసుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, తు.చ తప్పకుండా నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలన్నారు. అన్ని సదుపాయాలను అందుబాటులో ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్ విద్యాధికారి వెంక్యా నాయక్ ఉన్నారు.