సుప్రీం కోర్టు జస్టిస్ యు. యు. లలిత్ కు స్వాగతం పలికిన – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

సుప్రీం కోర్టు జస్టిస్ యు. యు. లలిత్ కు స్వాగతం పలికిన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, మహబూబ్ నగర్ ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి. సుప్రీం కోర్ట్ జస్టిస్ లలిత్ కుటుంబ సమేతంగా శనివారం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళుతూ మార్గ మధ్యలో నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ హరిత హోటల్ లో కాసేపు నిడివి చేశారు. ఈ సందర్బంగా మహబూబ్ నగర్ ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్,లు కలిసి జస్టిస్ లలిత్ కి ఘనంగా స్వాగతం పలికారు. పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన గౌరవ వందనం ఆయన స్వీకరించారు. అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ జ్ఞాపికను జిల్లా కలెక్టర్ సుప్రీం కోర్ట్ జస్టిస్ కు అందజేశారు. కాసేపు నిడివి చేసిన అనంతరం శ్రీశైలం పయనమయ్యారు.
అచ్చంపేట జూనియర్ సివిల్ జడ్జి ఉపాధ్యాయ విజయ్ కుమార్, కల్వకుర్తి అడిషనల్ జడ్జి సంపతి చందన రావు, అచ్చంపేట ఆర్డిఓ పాండు నాయక్, అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి, డిటి రఫ్ తదితరులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Share This Post