సుల్తానాబాద్ మండలంలో ఆకస్మికంగాపర్యటించిన జిల్లా కలెక్టర్


విద్యార్థుల ఆరొగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి::జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
ప్రతి రోజు పాఠశాల ఆవరణలో ఫాగ్గింగ్ చేయాలి
మండలంలో 5 మెగా పార్కుల ఏర్పాటుకు స్థలం గుర్తించాలి
పకడ్భందిగా ఓటరు జాబితా సవరణ చేపట్టాలి
సుల్తానాబాద్ మండలంలోని మహత్మ జ్యొతిభాపూలె గురుకుల పాఠశాల, పల్లె ప్రకృతివనం మరియు తహసిల్దార్ కార్యాలయాన్నీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి , నవంబర్ 16
:- విద్యార్థుల ఆరొగ్యం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో మహత్మ జ్యోతిభాపూలె గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనీఖీ చేసారు. రెసిడెన్షియల్ పాఠశాలను నిశ్చితంగా పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. పాఠశాలలోని బాత్ రూంలను, వంటగది, క్లాస్ రూంలను, భోజన గది, పాఠశాల పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి రోజు పాఠశాల ఆవరణలో ఫాగ్గింగ్ చేపట్టాలని గ్రామపంచాయతి అధికారులను కలెక్టర్ ఆదేశించారు విద్యార్థుల ఆరొగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గురుకుల పాఠశాలలో అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, విద్యా తదితర అంశాల పై కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల ఆరొగ్య పరిస్థితి పై స్టాఫ్ నర్స్ తో చర్చించి రెగ్యూలర్ గా విద్యార్థుల శరీం ఉష్ణోగ్రత్త పరిశీలించాలని కలెక్టర్ సూచించారు గురుకుల పాఠశాలలో నిర్మాణమవుతున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనుల పురొగతిని కలెక్టర్ ఆరాతీసారు. గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న భోధన, భోధనేతర సిబ్బంది వ్యాక్సినేషన్ 2 డోసుల పురొగతి వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. మండలంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ పై ఎంపిడిఒతో కలెక్టర్ చర్చించారు. పాఠశాలలో కరోనా నివారణ చర్యలు పాటించాలని, విద్యార్థులంతా తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజ్ చేయడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఐతరాజ్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా పల్లెప్రకృతి వనాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. మెగా పల్లెప్రకృతి వనంలో నాటిన మొక్కల సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని, ఎకో పార్క్ ఏర్పాటు సంబంధించిన ప్రతిపాదనలను రికార్డు నిర్వహించాలని అధికారులకు సూచించారు. మెగా పల్లెప్రకృతివనం నిర్వహణ కోసం బోర్, పైప్ లైన్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ విజ్ఞప్తి చేయగా, పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్నీ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ధరణీ పోర్టల్ లో పెండింగ్ దరఖాస్తులకు గల కారణాలను కలెక్టర్ ఆరా తీసారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురొగతిని కలెక్టర్ పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి చనిపోయిన వారి ఓట్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లు జాబితా నుంచి తొలగించాలని, అదే సమయంలో కరోనా వ్యాక్సినేషన్ సర్వే సైతం సమాంతరంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మండలంలో బూత్ స్థాయి అధికారుల పనితీరును విఆర్వో, ఆర్ఐ, డిప్యూటి తహసిల్దార్, తహసిల్దార్లు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు ప్రతి మండలంలో ఏర్పాటు చేసిన మెగా పల్లెప్రకృతి వనం ఏర్పాటు చెసామని, సుల్తానాబాద్ మండలంలో 5 మెగా పార్కులు ఏర్పాటు చేయడానికి అనుమైన స్థలాలను ఎంపిక చెయాలని కలెక్టర్ తహసిల్దార్ ను ఆదేశించారు.

 సుల్తానాబాద్ తహసిల్దార్ పాల్ సింగ్,ఎంపిడిఒ శశికళ,  బిసి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్  కె. రత్నాకర్,  సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post