సూక్ష్మస్థాయిలో పనులు చేపట్టాలి…

ప్రచురణార్థం

సూక్ష్మస్థాయిలో పనులు చేపట్టాలి…

మహబూబాబాద్ ఆగస్టు 25.

విద్యాసంస్థలు తెరవనున్న నేపద్యంలో అభివృద్ధి పనులు సూక్ష్మస్థాయిలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి విద్యాసంస్థల ప్రారంభం పై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక రూపొందించాలన్నారు. పదివేల లోపు పాఠశాల గ్రాంట్ నిధుల నుండి ఖర్చు చేయవచ్చు నన్నారు.

సర్పంచులు ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పాఠశాలల నిర్వహణకు కావలసిన మౌలిక వసతుల కల్పన ప్రధానంగా చేపట్టాలన్నారు.

విజయ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది వందల స్కూల్స్ సమాచారం సేకరించడం జరిగిందని వాటి పనితీరును పరిశీలించేందుకు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని నివేదిక అందజేస్తామన్నారు.
టెండర్లు రెంట్ ఫిక్సేషన్ తదితర అంశాలను అధికారులతో సమీక్షించారు సంవత్సర కాలంగా బ్లాక్ బోర్డ్ లు మరుగుదొడ్లు ట్యాంక్ క్లీనింగ్ వంటివి నిర్వహణ లేకపోవడంతో ప్రధానంగా వాటిపై దృష్టి సారించామని ఏ విధంగా మరింత మైక్రో ప్లాన్ అమలు చేసేందుకు పర్యవేక్షిస్తున్నా మన్నారు పాఠశాలలో ఆవరణలను క్రీడా స్థలాలుగా మార్చేందుకు ముళ్ళ కంపలు ఉంటే తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు వసతి గృహాలు లలో పరిశుభ్రత పెంచి విద్యార్థులు రాత్రి వేళల్లో అభ్యసించేందుకు లైట్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు అదేవిధంగా బెడ్స్ రైస్ వంటివి పరిశీలన చేస్తున్నామని వెంటనే తొలగిస్తా మన్నారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు దిలీప్ కుమార్ విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ వసతిగృహాల సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు
—————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post