సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల బలోపేతానికికేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ అఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంటర్ప్రైజస్ (PM FME) క్రింద గరిష్టంగా 10 లక్షల వరకు 35 శాతం మేర రాయితీ

సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల బలోపేతానికికేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ అఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంటర్ప్రైజస్ (PM FME) క్రింద గరిష్టంగా 10 లక్షల వరకు 35 శాతం మేర రాయితీ

జిల్లాలో ఉన్న సూక్ష్మ ఆహార శుద్దీకరణ పరిశ్రమల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ అఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంటర్ప్రైజస్ (PM FME) క్రింద గరిష్టంగా 10 లక్షల వరకు 35 శాతం మేర రాయితీ ఇస్తున్నదని, ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ సూచించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో PM FME అమలుపై ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి కమిటి సమావేశంలో మాట్లాడుతూ ఈ పధకం క్రింద వ్యక్తిగత పరిశ్రమలు, రైతు తయారీ, సహాకార సంఘాలు, స్వయం సహాయక బృందాలకు మాత్రమే ఈ రాయితీ లభిస్తుందన్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి భావన (One District one product ODOP) తో మామిడి, బంగాళాదుంప, టమాటా, పాలకోవా, అప్పడాలు, ఊరగాయ, తృణ ధాన్యాల ఉత్పత్తులు, చేపలు, మాంసం వంటి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల బలోపేతానికి రాయితీ అందిస్తుందని అన్నారు.
ప్రస్తుతం వ్యాపారంలో కొనసాగుతున్న అన్ని సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు. నూతనంగా ఈ రంగంలో వ్యాపారం ప్రారంబించాలనుకున్నవారు ODOP లో పేర్కొన్న ఉత్పత్తులకు మాత్రమే ఈ ప్రయోజనానికి అర్హులని ఆయన తెలిపారు. వ్యక్తిగత పరిశ్రమాలకైతే 18 సంవత్సరాలు నిండి 8వ తరగతి ఉతీర్ణులై ఉండాలని సూచించారు. పరిశ్రమలలో అయితే 10 మంది కన్నా ఎక్కవగ కార్మికులు పనే చేయరాదని, రిజిస్టర్ సంస్థలు అనర్హులని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వాటా సమకూర్చుకోవలసి ఉంటుందని ఆయన తెలిపారు. పరిశ్రమలు సంవత్సరానికి కోటి రూపాయల టర్నోవర్ చేస్తుండాలి అన్నారు. ఆహార శుద్ధి రంగంలో ఉన్న స్వయం సహాయక సంఘ సభ్యురాలు ఉపకరణాల కొనుగోలుకై 40 వేళా విత్తన మూలధన ఋణం ఇవ్వబడుతుందన్నారు.
జిల్లాలో సెర్ప్ ద్వారా బేకరి, తృణధాన్యాల శుద్ధి, మిర్చి,పసుపు, పప్పుదినుసుల ప్రాసెసింగ్, పిండి మర, అల్లం వెల్లుల్లి తయారీ, మినీ రైస్ మిల్, పాపడ్, చట్నీలు, పప్పులు, సుగంధ ద్రవ్యాలు, స్వీట్ కార్న్ వంటి 441 ఆహారశుద్ధి యూనిట్లు ఉన్నట్లు గుర్తించామని, అందులో 213 యూనిట్లు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని తమ కార్యకలాపాలను అభివృద్ధిపరచుకొనుటకు ముందుకొచ్చాయని అన్నారు. కాగా పధకం మార్గదర్శకాలకనుగుణంగా జిల్లా రిసోర్స్ పర్సన్ లు క్షేత్ర స్థాయిలో ఆ యూనిట్లను పరిశీలించి అర్హులైన 20 యూనిట్లను గుర్తించాయని అన్నారు. అందులో 12 మిర్చి, పిండి గిర్నీలు, 4 పాపడ్, ఒక పాల శుద్ధి, 3 చట్నీ యూనిట్లు ఉన్నాయని అన్నారు. ఈ 20 యూనిట్లకు 32 లక్షలు 67 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని వివిధ బ్యాంకుల ద్వారా అందించుటకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, రాష్ట్ర ఆహార శుద్ధి సంస్థ యాంకర్ పర్సన్ ప్రభంజన్ డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్,జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్ నాయక్, ఉద్యాన సహాయ సంచాలకులు నరసయ్య, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కృష్ణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post