సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి,టీఎస్‌ ఐ-పాస్‌ నిబంధనలకు లోబడి అనుమతులు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

నాగర్ కర్నూలు జిల్లాలో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించాలని, పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టీఎస్‌ ఐ-పాస్‌ నిబంధనలకు లోబడి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్‌ పీ ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలేక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు, తదితర అంశాలపై కమిటీ సభ్యులతో మంగళవారం చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో  ఆర్థిక సంవత్సరానికి 4 కోట్ల 52 లక్షల 61వేల 256 రూపాయల  పెట్టుబడితో 98 పరిశ్రమలను స్థాపించడానికి అనుమతులు మంజూరు చేశామని, తద్వారా 469మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే పారిశ్రామిక రాయితీ పథకం ద్వారా 46మంది ఎస్సీ అభ్యర్థులకు 1.47కోట్లు, 46మంది ఎస్టీ అభ్యర్థులకు 2.85 కోట్లు,6 గురు  దివ్యాంగ అభ్యర్థులకు 19.47లక్షలు మంజూరు చేశామని తెలిపారు.

సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ హనుమంతు నాయక్, జిల్లా రవాణా అధికారి ఎర్రిస్వామి జిల్లా భూగర్భజలాల అధికారిని రమాదేవి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మనోహర్రెడ్డి వివిధ శాఖల  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post