సూర్యాపేట. అన్ని మున్సిపాలిటీ లో సమాంతర అభివృద్ది. రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి.

జిల్లాల్లో అన్ని మున్సిపాలిటీలలో సమాంతర అభివృద్ది జరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పట్టణంలో  కోటి 25 లక్షల వ్యయం తో నిర్మించ నున్న మూడు పార్కుల కు యం.పి. బడుగుల లింగయ్య యాదవ్, ఇతర ప్రజా ప్రతినిధు ల్లతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ
సూర్యాపేట  సూర్యాపేట పట్టణాన్ని సుందర నగరం లా తీర్చిదిద్దడమే లక్ష్యం గా పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్న మని మున్సిపాలిటీ పరిధి లో  ఒకే రోజు 2 కోట్ల 25 లక్షల వ్యయం తో నిర్మించనున్న మూడు  పార్క్ లు ..సిసి రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు.9 వ వార్డ్ అంబేద్కర్ నగర్ లో 14 లక్షలు,27 వ వార్డ్ పరిధి లోని ఆర్. కె గార్డెన్స్ వద్ద 40 లక్షలు ,13 వ వార్డ్ అంజనపురి కాలనీ లో 45 లక్షల అంచనాలతో సి.సి రహదారులతో పాటు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు  సద్దుల చెరువు సమీపంలో 50 లక్షలు, 8 వార్డ్ పరిధి లోని ఇందిరమ్మ కాలనీ లో 50 లక్షలు, కృష్ణా టాకీస్ , ముత్యాలమ్మ గుడి  వెనుక భాగం లో 25 లక్షల వ్యయం తోచేపట్టిన  పార్కుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.శంకుస్థాపన కార్యక్రమoలో మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ,గ్రంధాల య చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్,  వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్లు  అనంతుల యాదగిరి గౌడ్, లక్ష్మీ కాంతమ్మ, ఆకుల లవకుశ ,కడారీ సతీశ్ యాదవ్, వట్టే రేణుక మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, రాష్ట్ర టి.అర్.ఎస్ కార్యదర్శి వై.వి, టి.ఆర్.ఎస్ నాయకులు ఉప్పల ఆనంద్, బైరు వెంకన్న, చనగాని రాంబాబు గౌడ్,  కక్కి రేణి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area

Share This Post