సూర్యాపేట జిల్లా రైతులకి అనువైన పంట పామ్ ఆయిల్ : జిల్లా కలెక్టర్ యస్ వెంకట్రావ్

  1. *సూర్యాపేట జిల్లా రైతులకు అనువైనది ఆయిల్ ఫామ్ సాగని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు*

శనివారం మధ్యాహ్నం మోతె మండలం, నామవరం శివారు లో రైతు గోవింద్ రెడ్డి తన ఆరున్నర ఎకరాల్లో వేసిన ఆయిల్ ఫామ్ సాగును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటలు పెంచుటకు భూమి, వాతావరణం, చాలా అనుకూలంగా ఉన్నాయని, జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ఆసక్తి చూపుతున్నానన్నారు గత సంవత్సరం ఒక 1760 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేయడం జరిగిందని ,వాటి పెరుగుదలను పరిశీలించిన కలెక్టర్ పంట ఆశాజనకంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరానికి గాను ప్రభుత్వం 9800 ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, లక్ష్యసాధనకు సరిపడే మొక్కలను మన జిల్లాలోనే రెండు నర్సరీలలో పంచడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు 1. మునగాల మండలం ,మాధవరం గ్రామంలో 2. నూతనకల్ మండలం, చిలుపకుట్ల గ్రామంలో సుమారు ఆరు లక్షల మొక్కలు పెంచడం జరుగుతుందని ఇట్టి మొక్కలు జూన్ నెలకు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రతినెల ప్రభుత్వాన్ని నిర్దేశించిన లక్ష్యం ప్రకారం పామ్ ఆయిల్ మొక్కలు అందించడం జరుగుతుందని, అంతేకాకుండా ఇట్టి తోటలు పెంచడానికి కావలసిన డ్రిప్ పరికరాలు సబ్సిడీపై అందించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 100% సబ్సిడీ పై, సన్న ,చిన్న కారు రైతులకు 90%, సబ్సిడీ పెద్ద రైతులకు 80%, సబ్సిడీ పై డ్రిప్స్ అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు .ఆయిల్ ఫామ్ తోటలు పెంచుటకు కావలసిన వివరాల కొరకు సమీప వ్యవసాయ అధికారి ని గాని సంబంధిత ఉద్యానవన శాఖ అధికారులను గాని సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ తోటలు పెంచుటకై ఎకరాకు 57 మొక్కలు అవసరం అవుతాయని, ఒక్కొక్క ముక్క ఖరీదు 193 రూపాయలు ప్రభుత్వమే భరించి సబ్సిడీపై రైతుకు అందించడం జరుగుతుందని, ఎకరానికి తోట పోషణకు మరియు అంతర్ పంట సాగుకు ప్రతి సంవత్సరం 4200 చొప్పున నాలుగు సంవత్సరాల గాను 16,800 అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కావున ఆసక్తి గల రైతులు ఇట్టి సబ్సిడీని ,ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థిరమైన ఆదాయం పొందాలని రైతులకు సూర్యపేట కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి శ్రీధర్ గౌడ్, హార్టికల్చర్ ఆఫీసర్ కే జగత్, ఆయిల్ ఫ్రెండ్ అధికారులు డీజీఎం యాదగిరి ,ఫీల్డ్ ఆఫీసర్ శశికుమార్, రైతులు గోవిందరెడ్డి, ప్రతాప్ రెడ్డి, నిర్మల ,ఆమని, పాల్గొన్నారు .

———————————————

Dpro………Suryapet

Share This Post