సూర్యాపేట. తేది.21.04.2022. పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లాలో 73 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలి. కేంద్రాలలో మౌళిక వసతులు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

 

జిల్లాలో పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి విద్యాశాఖ, అనుబంధ శాఖాధికారుల ను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని విద్యాశాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావుతో కలసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పదవ తరగతి పరీక్షలలో 12612 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆదిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మే 23 నుండి జూన్ ఒకటి వరకు ఉదయం 9:30 గం. నుండి మధ్యాహ్నము 12:45 గం. వరకు నిర్వహించే 73 పరీక్ష కేంద్రములలో అన్ని మౌళిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా పోలీసు అధికారులను ఆదేశిస్తూ అన్ని కేంద్రాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అలాగే జిల్లా పoచాయతీ అధికారి, మున్సిపల్ కమీషనర్లు సిబ్బందితో అన్ని పరీక్షా కేంద్రాలను షానిటైజెషన్ చేసి ప్రతి రోజు త్రాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. వైద్యా సిబ్బంది అన్ని పరీక్షా కేంద్రాలలో మెడికల్ కిట్స్ తో పాటు ORS ప్యాకెట్లు, ప్యారామెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంచాలని అదేవిదంగా పోస్టల్ శాఖ పర్యవేక్షకులు మధ్యాహ్నం 3:00 గంటల వరకు , భోజన విరామ సమయంలో కూడా జవాబు పత్రము కలిగియున్న bundles తప్పక స్వీకరించాలని సూచించారు. రవాణా శాఖ విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష రోజులలో ఎక్కువ బస్సులు నడపాలని అన్నారు. పరీక్షల సమయంలో ఏలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని , వేసవి దృష్ట్యా అన్ని పరీక్ష కేంద్రములలో త్రాగునీరు సరఫరా చేయవలసినదిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పరీక్ష కేంద్రములలోకి సిబ్బంది అలాగే విద్యార్ధులు సెల్ ఫోన్ తీసుకొని వెళ్లకుండా చూడాలని అన్నారు. అలాగే పరీక్ష నిర్వహణ బిల్లులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జిల్లా కోశాధికారిని ఆదేశించారు.
ఈ సమావేశంలో డి.ఈ. ఓ అశోక్, ఉప కోశాధికారి రమేష్, dmho dr. కోటా చలం,పోలీస్, రవాణా ,పోస్టల్ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post