సూర్యాపేట. తేది.26.04.2022. ఇంటర్ మీడియేట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లాలో 32 పరీక్షా కేంద్రాల ఏర్పాటు. అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలి. కేంద్రాలలో మౌళిక వసతులు కల్పించాలి. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

జిల్లాలో ఇంటర్ మీడియేట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఇంటర్ మీడియేట్, అనుబంధ శాఖాధికారుల ను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్ లో ఇంటర్ మీడియేట్ పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ 7180, ఒకేషనల్ 1510 మంది అలాగే రెండవ సంవత్సరం జనరల్ 7498, ఒకేషనల్ 1288 మంది మొత్తం 17476 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆదిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మే 06.5.2022 నుండి 24.5.2022 వరకు ఉదయం 9:00 గం. నుండి మధ్యాహ్నము 12:00 గం. వరకు నిర్వహించే 32 పరీక్ష కేంద్రములలో అన్ని మౌళిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సూర్యాపేట పరిధిలో 10 కేంద్రాలు, తిరుమలగిరి 2 కేంద్రాలు, నడిగూడెం 2 కేంద్రాలు, తుంగతుర్తి 3 కేంద్రాలు, కోదాడ పరిధిలో 7 కేంద్రాలు, నెరేడుచర్ల 2 కేంద్రాలు, హుజూర్ నగర్ 3 కేంద్రాలు, మట్టంపల్లి లో 1 కేంద్రం అలాగే ఆత్మకూరు 2 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్బంగా పోలీసు అధికారులను ఆదేశిస్తూ అన్ని కేంద్రాలలో పోలీసు బందోబస్తు చేయాలని అలాగే జిల్లా పoచాయతీ అధికారి, మున్సిపల్ కమీషనర్లు సిబ్బందితో అన్ని పరీక్షా కేంద్రాలను శానిటైజెషన్ చేసి ప్రతి రోజు త్రాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. వైద్యా సిబ్బంది అన్ని పరీక్షా కేంద్రాలలో మెడికల్ కిట్స్ తో పాటు ORS ప్యాకెట్లు, ప్యారామెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అదేవిదంగా పోస్టల్ శాఖ పర్యవేక్షకులు మధ్యాహ్నం 3:00 గంటల వరకు , భోజన విరామ సమయంలో కూడా జవాబు పత్రము కలిగియున్న bundles తప్పక స్వీకరించాలని సూచించారు. రవాణా శాఖ విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షల నిర్వహణ రోజులలో కేంద్రాల వారీగా బస్సులు నడపాలని అన్నారు. పరీక్షల సమయంలో ఏలాంటి అంతరాయం లేకుండా అన్ని కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా అన్ని పరీక్ష కేంద్రములలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయంలో నియమించబడిన అధికారులు వాట్స్ అప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పరీక్ష కేంద్రములలోకి సిబ్బంది అలాగే విద్యార్ధులు సెల్ ఫోన్ తీసుకొని వెళ్లకుండా చూడాలని అన్నారు.
ఈ సమావేశంలో ఆర్.డి.ఓ రాజేంద్ర కుమార్, డి.ఐ. ఓ ప్రభాకర్ రెడ్డి, డి.ఈ. ఓ అశోక్, మున్సిపల్ కమిషనర్ రామనుజుల రెడ్డి, పర్యవేక్షకులు సుదర్శన్ రెడ్డి, పోలీస్, రవాణా ,పోస్టల్ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post