సూర్యాపేట. తేది :28.04.2022. పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి. అన్ని కేంద్రాలలో మౌళిక వసతులు కల్పించండి. రాష్ట్ర విద్య శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జిల్లాలో ఏర్పాటు చేసే పరీక్షా కేంద్రాలలో అన్ని సౌలతులు కల్పిస్తాం. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

M

జిల్లాలో , పది, ఇంటర్మీడియెట్ అలాగే టెట్ పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
వచ్చే మే, జూన్ మాసాలలో పది, ఇంటర్మీడియెట్ , టెట్ పరీక్షల నిర్వహణ సందర్బంగా చేపట్టవలసిన వివిధ అంశాలపై రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి , విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా , కమీషనర్ దేవసేన ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ లతో కలిసి హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఈ సందర్బంగా మంత్రి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో పలు దఫాలుగా నిర్వహించే పది,ఇంటర్, టెట్ పరీక్షల సందర్బంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అలాగే మే మాసం దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పరీక్ష కేంద్రానికి సమయంలోపు రావాలని, నిమిషం ఆలస్యమైన పరీక్షా రాయడానికి అనుమతించరు అనే విషయాన్ని విద్యార్థులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు . పరీక్షల సందర్బంగా కొందమంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారని అలాంటి వారిని ప్రధానోపాధ్యాయులు , ఉపాద్యాయులు గుర్తుగించాలని పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించేందుకు మానసిక వైద్యులను సంప్రదించేందుకు వీలుగా 24 గంటలు అందుబాటులో ఉండే 18005999333 టోల్ ఫ్రీ ను ప్రవేశపెట్టడం జరిందని మంత్రి తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ ప్రతి ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయుల దగ్గర ఖచ్చితంగా ఉండాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీ.సీ కెమెరాలు అమర్చాలని, నిరంతరం విద్యుత్ సౌకర్యం ఉండేలా చూడాలని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఎఎన్ఎం లేదా ఆశా వర్కర్ ను తప్పనిసరిగా నియమించడంతో పాటు అత్యవసర మందులు, ఒ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్ఓ కు కలెక్టర్ సూచించారు. కోవిడ్ నిబంధనలను అనుగునంగా శానిటైజర్ ను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికమవుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద తప్పనిసరిగా టెంట్ , త్రాగు నీరు సౌకర్యం ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో జిరాక్స్ కేంద్రాలను మూసివేసేలా చర్యలు తీసుకోవలన్నారు. విద్యార్థులు పరీక్షలకు సమయానికి హాజరయ్యేందుకు వీలుగా బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్.టి.సి అధికారులను ఆదేశిచారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ బంధోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పది,ఇంటర్, టెట్ పరీక్షల నిర్వహణ సందర్బంగా ఏర్పాటు చేసే అన్ని పరీక్షా కేంద్రాలలో పటిష్టమైన ఏర్పాట్లతో పాటు పరీక్షలకు హాజరైయ్యే విద్యార్థులకు అన్ని మౌళిక వసతులు కల్పించడం జరుగుతుందని వివరించారు. పరీక్షల సందర్బంగా మానసిక వత్తిడితో ఉన్న పిల్లలను ముందస్తుగా గుర్తించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెం. 18005999333 ద్వారా వారి సమస్యలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అన్ని కేంద్రలలో , రూట్ ల వారీగా పరీక్షల సమయంలో బస్సులను విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. ఏర్పాటు చేసే 73 కేంద్రలలో పది పరీక్షలకు 12612 మంది విద్యార్థులు హాజరు అవుతున్నారని అలాగే 32 కేంద్రలలో ఇంటర్ పరీక్షలకు 17476 మంది విద్యార్థులు , జూన్ మాసంలో నిర్వహించే టెట్ పరీక్షలకు కొరకు 64 కేంద్రాలలో 15127 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు ఎస్పీ రితి రాజ్, డీఐఓ ప్రభాకర్ రెడ్డి , డీఈఓ అశోక్, డీఎంహెచ్ఓ dr. కోటా చలం, మున్సిపల్ ,ఆర్టీసీ, విద్యుత్, పోస్టల్, పోలీస్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post