సూర్యాపేట. తేదీ.22.1.2022. ఇంటింటి ఫీవర్ సర్వే పకడ్బందీగా చేపట్టాలి. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు. జిల్లాలో 1035 ఫీవర్ టీం లు. మొదటి దశ వ్యాక్సినేషన్ 97 శాతం పూర్తి. 77 శాతానికి చేరుకున్న రెండో దశ వ్యాక్సినేషన్ 15 నుండి 17 సంవత్సరాల యువతకు 51 శాతం. అర్బన్ , రూరల్ ప్రాంతాల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ జరగాలి. జిల్లాలో కోవిడ్ నియంత్రణలో ఉంది. కోవిడ్ వ్యాప్తి,వ్యాక్సినేషన్ పై సమీక్షించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి.

కోవిడ్ వ్యాప్తి
నియంత్రణకు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని కరోనా ఉధృతిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ సన్నద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్ నందు వైద్యాధికారులు అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన కోవిడ్-19 సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ లతో కలసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సౌకర్యాలు సిద్దంగా ఉంచాలని మంత్రి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. కోవిడ్, ఒమిక్రాన్,వ్యాక్సినేషన్ పై నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంటింటి ఫీవర్ సర్వే పకడ్బందీగా చేపట్టి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కరోనాను అరికట్టేందుకు మొదటి డోస్ వ్యాక్సినేషన్ లో 97 శాతంతో, రెండవ డోస్ వ్యాక్సినేషన్ లో 77 శాతంతో జిల్లా నిలిచిందని తెలిపారు.15 నుండి 17 సంవత్సరాల వయస్సు గల యువతకు ఇప్పటికే 51 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు ఏ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వ్యాధి గ్రస్తులకు ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ 4964 మందికి వేసినట్లు మంత్రి తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందకముందే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. కరోనా. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ ల బారి నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా యాక్టివ్ కేసులు 650 ఉన్నాయని అన్నారు.6 మంది మాత్రమే హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారని మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్దంగా ఉంచినట్లు తెలిపారు.జిల్లాలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి తో పాటు, ఏరియా ఆసూపత్రులు,పి.హెచ్. సి.లలో కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు.జిల్లాలో కరోనా పరీక్షల కిట్లకు,ఐసోలేషన్ కిట్లకు కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఏరియా ఆసుపత్రి లో కరోనా రోగులకు వైద్య చికిత్స అందించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పరిస్థితులు మెరుగు పరచాలని అన్నారు. ప్రభుత్వ ప్రదాన ఆసుపత్రి లో డయాలి సీస్ రోగులకు ప్రస్థుతం ఉన్న స్థితిగతులను తెలుసుకొని మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ఏరియా ఆసుపత్రి లో డయాలిసీస్ రోగులకు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం
జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల ప్రకారం కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎప్పటికప్పుడు వైద్యాధికారులు సలహాలు, సూచనలు చేస్తూ నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలెటర్లు, పడకలు పూర్తిస్థాయిలో సిద్దంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని సౌకర్యాలని సిద్దంగా ఉంచామని తెలిపారు. ఏ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్, 60 ఏళ్లు పైబడి అనారోగ్యంతో ఉన్న వృద్దులకు బూస్టర్ డోస్ నుండి అందిస్తున్నామని అన్నారు. 15 నుండి 17 సంవత్సరం గల వయస్సు వారందరికి కోవిడ్ వ్యాక్సినేషన్ అందిస్తున్నామని తెలిపారు. కరోనా, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు పకడ్బంధీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో యం. సి.హెచ్ కు రెండు భవంతు ల నిర్మాణం చేపట్టుటకు ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పేషంట్ వైటింగ్ హాల్, అలాగే క్యాంటీన్ ఏర్పాటుకు కూడా అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశం లో dmho dr. కోటా చలం, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు dr. మురలిధర్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ dr. శారదా, dio dr. వెంకటరమణ, డి.పి.ఓ యాదయ్య, సి.పి.ఓ సురేష్, వైద్యాధికారులు తదితరులు
పాల్గొన్నారు.

Share This Post