సూర్యాపేట లో జోరుగా కంటి వెలుగు పెన్ పహాడ్ మండలం మాచారం లో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన మంత్రి స్వయంగా పరీక్షలు నిర్వహించిన మంత్రి

భవిత కు వెలుగు కంటి వెలుగు

ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష

రాష్ట్రం లో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదనేది కేసీఆర్ అభిమతం

సూర్యాపేట లో జోరుగా కంటి వెలుగు

పెన్ పహాడ్ మండలం మాచారం లో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన మంత్రి

స్వయంగా పరీక్షలు నిర్వహించిన మంత్రి

 

కంటి వెలుగు’ను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి జగదీష్ రెడ్డి

పెన్ పహాడ్/సూర్యాపేట

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట నియోజకవర్గం పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామం లో కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి సందర్శించారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని, కంటి చూపు ఉంటేనే మన జీవితం ముందుకెళ్తుందని, అంధత్వంలేని తెలంగాణ కోసం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, అన్నారు. కేంద్రాల్లో కంటి వెలుగు స్క్రీనింగ్ పరిక్షల నిర్వహణ అద్భుతంగా కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి – సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. కంటి చూపు బాగుంటేనే మనం ఏ పని అయిన చేసుకోగలుగుతామని, గ్రామీణ ప్రాంతాల్లో కంటి పరీక్షలు చేసుకోవాలంటే పట్టణాలకు వెళ్ళాలని, అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని కంటి వెలుగు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. కంటి వెలుగు ఒక మంచి ప్రజా ప్రయోజిత కార్యక్రమమని ప్రజలు మరింతగా సద్వినియోగించుకోవలని కోరారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, ఏ ఇతర పథకాలు చేపట్టినా వంద శాతం అమలు చేసింది ఒక్క తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. ఇంత గొప్ప పథకాలని అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యాంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలని మీ అందరిని కోరుతున్నానన్నారు. ప్రజా ప్రతినిధులు కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలకి అవగాహన కల్పించి అధికారులని సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని కోరారు.

Share This Post