సెక్టోరల్ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్.

అక్టోబర్ 14 లోగా అన్ని పోలింగ్ స్టేషన్ లలో మౌళిక వసతులు కల్పించాలి:

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

-000-

అక్టోబర్ 14 లోగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ స్టేషన్ లలో అవసరమైన మౌళిక వసతులను కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల సెక్టోరల్ అధికారులు, పంచాయితీ ఇంజనీరింగ్ అధికారులతో పోలింగ్ స్టేషన్ లలో మౌళిక వసతుల కల్పన పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ స్టేషన్ లలో విద్యుత్ సౌకర్యం, లైటింగ్, ర్యాంపులు, త్రాగు నీటి వసతి, టాయిలెట్లు, షామియానాలు, వీలు చైర్లు మొదలగు అన్ని సౌకర్యాలు తప్పకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కెంద్రాలకు ర్యాంపులు లేనిచో వెంటనే ర్యాంపులు నిర్మించి బిల్లులు సమర్పిస్తే చెల్లిస్తామని పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం లేనిచో వెంటనే ట్రాన్స్ – కో అధికారులను సంప్రదించి విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని సెక్టోరల్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కెంద్రాలలో టాయిలెట్లు లేనిచో వెంటనే తాత్కాలిక టాయిలెట్ల ను ఏర్పాటు చేయాలని అన్నారు. ర్యాంపులు, టాయిలెట్లు సరిగా లేనిచోట వెంటనే సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయితీ అధికారులతో సంప్రదించి వెంటనే మరమ్మతులు చేయించి వినియోగంలోనికి తీసుకురావాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ లలో ర్యాంపులు, టాయిలెట్లు నిర్మాణాలు, మరమ్మతులు చేయించుటకు మండలానికి ఒక పంచాయితీ రాజ్ డి.ఈ. ని హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీకి పంచాయితీ రాజ్ డి.ఈ., ని ఇన్ చార్జీ అధికారులుగా నియమించాలని పంచాయితీ రాజ్ ఈ.ఈ. ని ఆదేశించారు. అన్ని పోలింగ్ స్టేషన్లను సెక్టోరల్ ఆఫీసర్లు, పంచాయితీ రాజ్ ఇంజనీర్లు సంయుక్తంగా తనిఖీ చేసి అవసరమైన ర్యాంపులు, టాయిలెట్లు నిర్మించి విద్యుత్ కనెక్షన్ తీసుకొని, కావాల్సిన ఫర్నిచర్, వీల్ చైర్స్ సమకూర్చి అక్టోబర్ 14 లోగా పోలింగ్ స్టేషన్ లలో అన్ని వసతులు కల్పించినట్లు నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఈ.వి.యం. ల కమీషనింగ్, ఈ.వి.యం. ల తయారు, ఈ.వి.యం. లు వినియోగించుట, మాక్ పోలింగ్ చేయు విధానం పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సెక్టోరల్ ఆఫిసర్లకు కలెక్టర్ అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, కలెక్టరేట్ ఏ.వో. లక్ష్మా రెడ్డి, సెక్టోరల్ అధికారులు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post