సెక్టోరియల్ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్.

 

సెక్టోరల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి

పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలను పరిశీలించాలి

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
-000-

సెక్టోరల్ అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి కేంద్రాలలోని సౌకర్యాలను పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సెక్టోరల్ అధికారులను సూచించారు.

హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలలో సెక్టోరల్ అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని అన్నారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి కరెంట్, టాయిలెట్స్, ఫర్నిచర్, ర్యాంపులు తదితర సౌకర్యాలను గుర్తించాలని సౌకర్యాలు లేని చోట సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సౌకర్యాలు లేకుంటే వాటిని గ్రామ పంచాయితీ కార్యదర్శులు, ఎం.పి.డి.వో. లతో పూర్తి చేయించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలలో టాయిలెట్లను శుభ్రం చేయించాలని, చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేయించాలని తెలిపారు. త్రాగు నీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పి.వో.లు, ఏ.పి.వో.లు, ఓ.పి.వో.లు, సిబ్బంది అందరూ కోవిడ్ డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని అన్నారు. ఓటర్ల పై అధికంగా ప్రభావం చూపే వల్నరబిలిటి (సమస్యాత్మక) ప్రాంతాలను పోలీసుల సహకారంతో గుర్తించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సెక్టోరల్ అధికారులకు సూచించారు. అనుమతి లేకుండా ప్రచారాలు నిర్వహించే రాజకీయ పార్టీలు,వ్యక్తుల పై కేసులు బుక్ చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల రూట్లను ముందుగానే చూసుకోవాలని, పోలింగ్ సామాగ్రి, పోలింగ్ సిబ్బందితో ఒక రోజు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పోలింగ్ రోజు ఉదయం 6.00 గంటల కే మాక్ పోలింగ్ తప్పని సరిగా నిర్వహించాలని అన్నారు. మాక్ పోలింగ్ లు పోలింగ్ ఏజెంట్ల ముందు నిర్వహించి 50 ఓట్లు పోల్ అయ్యేలా చూడాలని అన్నారు. మాక్ పోలింగ్ అనంతరం డాటా క్లియర్ చేయాలని తెలిపారు. వి.వి. ప్యాట్ లలో స్లిప్స్ లేకుండా చూసి సీల్ చేయాలని అన్నారు. ఎన్నిక ముగియగానే కంట్రోల్ యూనిట్ బటన్ క్లోజ్ చేయాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో వి.వి. ప్యాట్ లను చెక్ చేయవద్దని తెలిపారు. సెక్టర్ అధికారులకు శనివారం ఉదయం 10.00 గంటలకు హుజురాబాద్ లో వాహనాలు సమకూర్చాలని డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ ను ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది అందరికి డబుల్ డోస్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా చూడాలని జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. బి.ఎల్.వో. ల ద్వారా ఓటర్ జాబితాలను చెక్ చేసుకోవాలని సెక్టర్ అధికారులకు సూచించారు. ఈ.వి.ఎం. లు అన్ని సెక్టోరల్ అధికారుల కంట్రోల్ లోనే ఉంటాయని, పోలింగ్ రోజు రిజర్వు ఈ.వి.ఎం. లను కూడా పోలింగ్ కేంద్రాలకు వెంట తీసుకువెళ్లాలని కలెక్టర్ తెలిపారు. పబ్లిక్ హెల్త్ , ఆర్ అండ్ బి, ఇరిగేషన్, పంచాయితీ రాజ్, మిషన్ భగీరథ, ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని పోలింగ్ కేంద్రాలలో అసౌకర్యాలు లేకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, సెక్టోరల్ అధికారులు, ఆర్ అండ్ బి, పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, పంచాయితీ రాజ్,ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

 

 

Share This Post