సెప్టెంబర్‌ 1వ తేదీన విద్యాసంస్థల పున: ప్రారంభానికి అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలు సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి పున : ప్రారంభించనున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమీషనర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో మూసివేసిన విద్యాసంస్థలను పున: ప్రారంభించే అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నత న్థాయి సమావేశంలో విద్యా సంస్థలు మూతపడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సహా ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యా అనుబంధ రంగాల్లో ఏర్పడిన అయోమయ పరిస్థితి, రాష్ట్రంలో కరోనా నియంత్రణ, విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసి వేయడంతో విద్యార్ధినీ విద్యార్థుల్లో ‘పెరుగుతున్న మానసిక ఒత్తిడి, వారి భవిష్యత్తుపై ప్రభావం అంశాలపై చర్చించి విద్యాసంస్థలను తగు జాగ్రత్తలు పాటిస్తూ సెప్టెంబర్‌ 1వ తేదీ నుండి పున;ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలల్లో పారిశుద్ద్య చర్యలు చేపట్టాలని, పాఠశాలల్లోని ప్రతి గతి, మూత్రశాలలు, మరుగుదొడ్లు, వంటగది అన్నింటిని శుభ్రపరచాలని, ప్రతి పాఠశాలకు మిషన్‌ భగీరథ ద్వారా నల్లా నీరు సరఫరా చేయాలని, విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్క విద్యార్థి తప్పని సరిగా మాస్కులు ధరించి పాఠశాలలకు రావాలని, ప్రైవేట్‌ పాఠశాలలో పారిశుద్ద చర్యలపై జిల్లా విద్యాధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల బస్సులలో విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలలు, అంగన్వాడీ కెంద్రాలలో పారిశుద్ద్య పనులలో సంబంధిత అధికారులు, సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యులు కావాలని, ఈ నెల 80వ తేదీ లోగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పారిశుద్ద్య చర్యలు నిర్వహించి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని, పాఠశాలలు ప్రారంభం అయిన తర్వాత ప్రతి రోజు జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా పంచాయితీ అధికారులు, ఎం.పి.డి.వో.లు, మండల విద్యాధికారులు, మండల పంచాయితీ అధికారులు పాఠశాలలను సందర్శిస్తూ పారిశుద్ద్య చర్యలను కొనసాగేలా చర్యలు తీసుకోవాలని, కొవిడ్‌ నిబంధనల మేరకు స్వచ్చందంగా వచ్చే విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని, పాఠశాలలో ఏదేనీ ఒక విద్యార్థి దగ్గు, జలుబు, జ్వరము వంటి కొవిడ్‌ లక్షణాలతో ఉంటే వెంటనే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించాలని, విద్యార్థికి కొవిడ్‌ పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన పక్షంలో విద్యార్థి ఆ తరగతి గదిలో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్‌ విద్యార్థులను గుర్తించి అందరికి కొవిడ్‌ పరీక్షలు చేయించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. రాష్ట్ర పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలో పకద్బందీ పారిశుద్ద్య చర్యలు చేపట్టి పండుగ వాతావరణంలో సెప్టెంబర్‌ 1న పాఠశాలలను ప్రారంభించాలని,
ప్రతి రోజు పాఠశాలల్లో పారిశుద్ధ్య చర్యలు (గ్రామపంచాయితీ ద్వారా నిర్వహించాలని, పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించాలని, నిల్వ నీరు లేకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు, విద్యార్థుల కమిటీలు ఏర్పాటు చేసి పరిశుభ్రమైన పరిసరాలలో పాఠశాలల్లో విద్యా భోదన చేయుటకు చర్యలు తీసుకొవాలని సూచించారు. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం అన్ని పాఠశాలల పారిశుద్ద్య పనుల నిర్వాహణ బాధ్యత గ్రామ పంచాయితీలదేనని, సంబంధిత ఏ. ఈ.లు పాఠశాలను సందర్శించి నల్లాలు లేనిచోట అమార్చాలని, ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ద్య చర్యల నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ ఆగస్టు ౩0వ తేదీ నాటికి పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తి చేసేలా ప్రత్యేక డైవ్‌ చేపడతామని, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో విద్యా సంస్థల ప్రారంభానికి పూర్తి స్థాయిలో సిద్దం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్‌, మండల పరిషత్‌ అభివృద్ది అధికారులు, మండల పంచాయతీ అధికారులు, మున్సిపల్‌ కమీషనర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post