సెప్టెంబర్ 1 నుండి అంగన్వాడీ కేంద్రాలు సహా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు పునఃప్రారంభంపై జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ జిల్లా అధికారులతో సమావేశం


సెప్టెంబర్ 1 నుండి అంగన్వాడీ కేంద్రాలు సహా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు
పాఠశాలలు పునఃప్రారంభంపై జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ అనిత హరినాథ్
రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ జిల్లా అధికారులతో
సమావేశం నిర్వహించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని కోర్ట్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో
కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి తరగతిలో శానిటైజర్ ఏర్పాటు చేయాలని, ప్రతి
పాఠశాలకు మంచి నీటి సౌకర్యం నల్లా ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ
అధికారులను ఆదేశించారు. పాఠశాలలో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు
తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ సౌకర్యం లేనట్లయితే
పునరుద్దరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పాఠశాలలోని ఫర్నీచర్
శుభ్రం చేయించాలని , పాఠశాలల్లోని నీటి సంపులను, ట్యాంకులను
శుభ్రపరచాలన్నారు. తరగతి గదులను శానిటైజషన్ చేయాలని అన్నారు.
విద్యార్థులకు ఎవరికైనా జ్వరం , కరోనా లక్షణాలు కనిపిస్తే సిక్ రూమ్
ఏర్పాటు చేసి వైద్యాధికారులకు తెలియజేయాలని అన్నారు. మండల స్థాయిలో ఎంపీ
ఓ, ఎంపీడీఓ, ఎంఈ ఓ గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ , పంచాయతీ సెక్రటరీ
కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, అధికారులు
ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.
చెక్ లిస్ట్ ప్రకారం ప్రతి పాఠశాలలో పారిశుధ్య పనులను చేపట్టినట్లు
నివేదిక తయారు చేసి ఈ నెల 28 లోగా పంపాలని ఆదేశించారు. ప్రతి తరగతిలో
విద్యార్థులు మాస్కులు ధరించేలా చూడాలని అన్నారు. సామజిక దూరం పాటించేలా
చర్యలు తీసుకోవాలని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు , జడ్పి సీఈఓ దిలీప్
కుమార్ , జిల్లా విద్యాశాఖ అధికారి సూసింద్ర రావు , డీపీఓ శ్రీనివాస్
రెడ్డి , ఎస్సి వెల్ఫేర్ అధికారి శ్రీధర్, బీసీ వెల్ఫేర్ అధికారి విద్య
, మైనారిటీ వెల్ఫేర్ అధికారి రత్న కళ్యాణి సంబంధిత అధికారులు తదితరులు
పాల్గొన్నారు.

Share This Post